వాళ్లని వదులుకునేందుకు సిద్ధమైన సన్రైజర్స్.. కెప్టెన్ ను కూడా?

praveen
కొన్ని సీజన్ల నుంచి బ్యాటింగ్లో ఎంతో బలహీనంగా ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గత యేడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రమే మెగా వేలం సందర్భంగా బ్యాటింగ్ విభాగంలో పటిష్టంగా మార్చుకునేందుకు కొంతమంది ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు.. ఇందులో భాగంగానే నికోలస్ పూరన్, మార్కరం, రాహుల్ త్రిపాఠి లాంటి ప్లేయర్లను  దక్కించుకుంది. ఈ క్రమంలోనే మొదటి రెండు మ్యాచ్ లలో ఓడిన సన్రైజర్స్ ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్ లలో విజయం సాధించింది. కానీ ఆ తర్వాత మాత్రం హైదరాబాద్ కి వరుసగా ఓటమిలు తప్పలేదు.



 అయితే గతంలో సన్రైజర్స్ నిలకడగా ఆడింది అంటే కారణం కేవలం ఓపెనర్లు మాత్రమే అని చెప్పాలి. బెయిర్ స్ట్రో, వార్నర్ లు క్లిష్ట పరిస్థితుల్లో కూడా జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. కొన్నాళ్లపాటు జట్టు భారం మొత్తం వారిద్దరూ భుజాలపై మోశారు. ఈ సీజన్ మాత్రం ఓపెనింగ్ జోడిగా అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ బరిలోకి దిగారు. అయితే అభిషేక్ శర్మ కాస్త సక్సెస్ అయినప్పటికీ కేన్ విలియమ్సన్ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో ఇక సన్రైజర్స్ యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.



 వచ్చే సీజన్లో ఎంతో మంది ఆటగాళ్లకు  సన్రైజర్స్ యాజమాన్యం ఉద్వాసన పలికే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అయితే ఈసారి ఛేజింగ్ లో సన్రైజర్స్ తడబడింది అంటే దానికి కారణం కేన్ విలియమ్సన్  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టెస్ట్ ఫార్మట్ తరహాలో ఆడుతూ విజయతీరాలకు కాదు ఓటమి వైపు నడిపించాడు. ఈ క్రమంలోనే కేన్ విలియమ్సన్  వదులుకునేందుకు కూడా సన్రైజర్స్ సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. వీరితోపాటు అబ్దుల్ సమద్, అబౌట్, ఫారుఖి, శ్రేయస్ గోపాల్ లాంటి పేర్లను కూడా అటు జట్టు నుంచి తప్పించి కొత్త వాళ్ళని తీసుకోవాలని ప్లాన్ వేస్తుందట సన్రైజర్స్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: