నేనే తప్పుకున్నా.. నిజం బయట పెట్టిన హార్దిక్ పాండ్యా?
ఇకపోతే ఇటీవలె ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా మైదానంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ బౌలింగ్లో కూడా సత్తా చాటాడు. కెప్టెన్సీ వ్యూహాలతో కూడా దుమ్ము రేపి అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ నెల 9 నుంచి దక్షిణాఫ్రికాతో భారత వేదికగా జరగబోయే 5 టి20 సిరీస్ లో కూడా అవకాశం దక్కించుకున్నాడు. అయితే గుజరాత్ కోసం ఆడటాన్ని ఎంతగా ఇష్టపడతానో దేశం కోసం ఆడటాన్ని అంతకంటే ఎక్కువగా ఇష్టపడతాను అంటూ ఇటీవల హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలోనే ఇన్నాళ్ల పాటు టీమిండియా జట్టు కు దూరంగా ఉండడం పై అసలు నిజాలు బయట పెట్టాడు హార్దిక్ పాండ్యా.. తనను ఎవరూ కూడా భారత జట్టు నుంచి తప్పించ లేదని తనకు తానుగా విశ్రాంతి కావాలనే కోరి బీసీసీఐ అనుమతితో సెలక్షన్ కమిటీ కి దూరంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. టీమిండియా నుంచి నన్ను తప్పించారు అంటూ ఎంతో మంది అపార్థం చేసుకున్నారు. నిజానికి అది నా వ్యక్తిగత నిర్ణయం మాత్రమే. సెలక్షన్ కమిటీ కి అందుబాటులో ఉండి అప్పుడు జట్టులో సెలెక్ట్ కాకపోతే నన్ను తప్పించినట్లు.. కానీ నా విషయంలో మాత్రం నేనే కావాలని సెలవు తీసుకున్నాను.. నా అభ్యర్థనను మన్నించినా బీసీసీఐకి ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ హార్దిక్ పాండ్య చెప్పుకొచ్చాడు..