ఆ ఇద్దరినీ తప్పించి మంచి పని చేశారు : బ్రాడ్ హాగ్

praveen
గత ఏడాది భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఎంత ఉత్కంఠభరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా అన్ని మ్యాచ్ లు ఉత్కంఠగా జరుగుతున్న సమయంలో కరోనా వైరస్ ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో ఇక 5 వ మ్యాచ్ రద్దు అయింది అన్న విషయం తెలిసిందే. టీమిండియా శిబిరంలో కొంతమంది కరోనా వైరస్ బారిన పడడంతో ఈ మ్యాచ్ను రద్దు చేశారు. ఆ తర్వాత సరైన సమయం చూసుకొని ఈ మ్యాచ్ నిర్వహించాలని టీమిండియా భావించింది. ఈ క్రమంలోనే ఇక ఈ ఏడాది ఈ మ్యాచ్ నిర్వహించాలని బిసిసీఐ ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించింది.


 జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ మధ్య ఇక ఇంగ్లాండ్ తో మిగిలిపోయిన చివరి టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. అయితే ఇందుకు సంబంధించిన భారత జట్టును ఇటీవలే ప్రకటించింది బీసీసీఐ. ఇందులో సీనియర్ ఆటగాళ్లు అయిన అజింక్యా రహానే ఇషాంత్ శర్మ లకు చోటు దక్కలేదు అని చెప్పాలి. సీనియర్ల స్థానంలో యువ క్రికెటర్లు కెఎస్ భరత్, ప్రసిద్ధి కృష్ణ అవకాశం దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు సీనియర్ ప్లేయర్లను తొలగించడం పై స్పందించిన ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 అజింక్య రహానే ఇషాంత్ శర్మలను తుది జట్టు నుంచి తొలగించడం గొప్ప విషయమే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇద్దరు వయసు కూడా ఎక్కువ అవ్వడం వల్ల సామర్థ్యం మేరకు రాణించలేకపోయారు. భారత సెలెక్టర్లు ఇలాగే ముందుకు సాగితే బాగుంటుంది.. యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తూనే ఇక ప్లేయర్ లు అందరినీ రొటేట్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల ఎంతోమంది యువ ఆటగాళ్లకు అనుభవజ్ఞులతో కలిసి ఆడే అవకాశం పొందుతూ ఉంటారు.  ఇక కోహ్లీతో కలిసి శ్రేయస్ అయ్యర్ మరికొన్నాళ్లు ఆడబోతున్నాడు. కోహ్లీ నుంచి ఎన్నో మెళకువలు కూడా నేర్చుకుంటాడు. ఇప్పుడు బుమ్రా షమి లకు తోడుగా ప్రసిద్ధి కృష్ణ వస్తున్నాడు. ఇలా ఆటగాళ్లను రోటేట్ చేయడం మంచిదని బ్రాడ్ హాగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: