పెద్ద పేరుంటే సరిపోదు.. కోహ్లీ రోహిత్ పై కపిల్ దేవ్?
ఈ క్రమంలోనే ఇక టీమిండియా లో సీనియర్లు గా ఉన్న ఇద్దరు పేలవ ప్రదర్శన చేస్తూ ఉండటం భారత జట్టుకు మైనస్ గా మారిపోతుంది. నిన్న జరిగిన ఐపీఎల్ లో కూడా ఇద్దరి ప్రదర్శన అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇప్పుడు ఇదే విషయం పై టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కె.ఎల్.రాహుల్ లాంటి సీనియర్ల ఆటతీరుపై కపిల్ దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ముగ్గురు సీనియర్ క్రికెటర్ల కు పెద్ద పేరుంది.. ఇక దీంతో పాటు ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ ఒత్తిడి తమ ఆట పై పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలాంటి భయాందోళనకు లోను కాకుండా క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. ఇక జట్టుకు పరుగులు అవసరమైన సమయంలో ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన టైంలో కూడా ఈ ముగ్గురు క్రికెటర్లు కూడా వికెట్ కోల్పోతూ టీమిండియాను మరింత కష్టాల్లోకి నెడుతున్నారు. పెద్ద పేరు ఉంటే సరిపోదు దాన్ని నిరూపించుకోవాలి.. లేదంటే పక్కన పెట్టాలి అంటూ కపిల్ దేవ్ అసంతృప్తివ్యక్తం చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు..