వకార్ కాదు.. బుమ్రా నా స్ఫూర్తి : ఉమ్రాన్ మాలిక్
ఇక ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్లో కూడా ఫాస్టెస్ట్ డెలివరీ ఉమ్రాన్ మాలిక్ పేరిట ఉంది అని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే అతని బౌలింగ్ ప్రతిభపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కూడా కురిపించారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ సైతం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ యాక్షన్ అచ్చం పాకిస్తాన్ దిగ్గజం వకార్ యూనిస్ ను గుర్తు చేస్తుందని బ్రెట్లీ వ్యాఖ్యానించాడు. అయితే ఇటీవలే ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయంపై స్పందించాడు ఉమ్రాన్ మాలిక్. నా బౌలింగ్ యాక్షన్ ఎవరిని అంగీకరించలేదని సహజసిద్ధమే అంటూ తెలిపాడు.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ బౌలింగ్ యాక్షన్ నేను ఎప్పుడూ అనుకరించలేదు. నాకు భారత బౌలర్లు జస్ప్రిత్ బూమ్రా, షమి, భువనేశ్వర్ కుమార్ స్పూర్తి. చిన్నప్పటి నుంచి వారి బౌలింగ్ చూస్తూనే పెరిగాను. వారి బౌలింగ్ చూసి క్రికెట్ లో రాణించాలి అనుకున్నాను. ఇక ఇప్పుడు నేను టీమిండియాను ఎంపిక కావడంతో పొంగిపోవడం లేదు అంటూ ఉమ్రాన్ మాలిక్ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే కష్ట పడుతూ ఉంటే జరిగేది కచ్చితంగా జరుగుతుందని దాని కోసం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.ఇక దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ లో మంచి ప్రదర్శన చేయాలనుకుంటున్నాను అంటూ తెలిపాడు..