బచ్చగాడివి అన్నారు.. అందుకే అలా రియాక్ట్ అయ్యా : రియాన్ పరాగ్

praveen
ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున కొనసాగిన యువ ఆటగాడు రియాన్ పరాగ్ తన ప్రదర్శనతో ఎక్కడ ఆకట్టుకోలేకపోయాడు అన్న విషయం తెలిసిందే. బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్లో కూడా ఎక్కడ రాణించలేకపోయాడు. కానీ సీనియర్లతో కాస్త రాష్ గా వ్యవహరించి విమర్శలు మాత్రం ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్య జరిగిన ఒక లీగ్ మ్యాచ్లో  సీనియర్లు అయిన హర్షల్ పటేల్,  సిరాజ్ లతో వ్యవహరించిన తీరు సంచలనంగా మారింది.



 సీనియర్లతో వ్యవహరించే తీరు ఇదేనా అంటూ ఎంతో మంది అతన్ని తప్పు పట్టారు కూడా. అయితే ఆ రోజు అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు రియాన్ పరాగ్. రాజస్థాన్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సందర్భంలో హర్షల్ పటేల్ ఏమి అసభ్యకరంగా దూషించలేదని తెలిపిన రియాన్ పరాగ్ అటు మొహమ్మద్ సిరాజ్ మాత్రం నాతో వాగ్వాదానికి దిగాడు అంటూ చెప్పుకొచ్చాడు. గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో నేను వికెట్ కొల్పోయిన సమయంలో మైదానం నుంచి వెళ్ళిపో అన్నట్లుగా హర్షల్ పటేల్ సైగ చేసాడు. నేను పెవిలియన్ కు వెళ్ళిన తర్వాత టీవీ రీప్లే లో అది చూశాను.

 ఇక అప్పటి నుంచి అది నా మనసులో అలాగే ఉండిపోయింది. ఇక ఈ ఏడాది బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో హర్షల్ పటేల్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు  కొట్టాను. గతంలో నా విషయంలో అతను ఎలా ప్రవర్తించాడో నేను అలాగే ప్రవర్తించా.  ఎలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడలేదు. కాని ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత సిరాజ్ నన్ను పిల్లాడివి పిల్లాడిలా ప్రవర్తించు అని చెప్పాడు. అలా అనడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు వచ్చి మిమ్మల్ని ఆపారు అంటూ ఆరోజు జరిగిన విషయాన్ని తెలిపారు రియాన్ పరాగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: