ఉమ్రాన్ బౌలింగ్ పై.. సౌతాఫ్రికా కెప్టెన్ ఏమన్నాడో తెలుసా?
అంతే కాకుండా ఇక కీలకమైన సమయం లో వికెట్లు పడగొట్టి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం లో కీలక పాత్ర వహించాడు. అయితే అతని ప్రతిభను మెచ్చిన భారత సెలెక్టర్లు సౌతాఫ్రికాతో జరగబోయే టి20 సిరీస్ లో అతనికి అవకాశం కల్పించారు అన్న విషయం తెలిసిందే. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరం గా మారి పోయింది. ఇకపోతే ఇటీవలే టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ప్రతిభ గురించి సౌతాఫ్రికా కెప్టెన్ టెంప బావుమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా తో ఆడబోయే టీ20 సిరీస్ లో ఉమ్రాన్ మాలిక్ ఫాస్ట్ బౌలింగ్ ను ఎదుర్కునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తమ జట్టు లో కూడా 150 కిలోమీటర్ల వేగం తో బంతులు విసరగా బౌలర్లు ఉన్నారని తిరుపాడు టెంప బావుమా. అయితే ఏ బ్యాట్స్మెన్ కూడా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో వచ్చే బంతిని ఎదుర్కోవడానికి ఇష్టపడడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అలాంటి వేగం తో బంతులు విసిరే ఉమ్రాన్ మాలిక్ లాంటి బౌలర్ టీమిండియాకు దొరికాడు. ఇక ఐపీఎల్లో రాణించినటు గానే అతను అంతర్జాతీయ క్రికెట్ లో కూడా రాణించాలని ఆశిస్తున్నాను బావుమా తెలిపాడు.