కోహ్లీకి షాక్.. ఆ రికార్డును బ్రేక్ చేసిన పాక్ క్రికెటర్?

praveen
గత కొంత కాలం నుంచి పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్న బాబర్ అజాం ఒకవైపు జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించడమే కాదు మరోవైపు ఒక ఆటగాడిగా ఎంత అద్భుతంగా రాణిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి మ్యాచ్లో కూడా వరల్డ్ క్లాస్ ప్రదర్శన చేస్తూ వరల్డ్ రికార్స్ అన్నింటినీ కూడా చెరిపేస్తూ తన పేరును లిఖించుకున్నాడు అనే చెప్పాలి. ఇక ఇప్పటికే టీ20 వన్డే ఫార్మాట్లలో నెంబర్వన్ స్థానంలో కొనసాగుతున్నాడు బాబర్ అజాం.


 గత కొంతకాలం నుంచి మాత్రం రికార్డుల వేట కొనసాగిస్తూ అభిమానులందరినీ కూడా ఆనందంలో ముంచెత్తుతూ ఉన్నాడు. అయితే గతంలో ఎంతో మంది క్రికెటర్లు సాధించిన రికార్డులని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అతి తక్కువ సమయంలో బ్రేక్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ కోహ్లీ కంటే వేగంగా రికార్డులనూ రీచ్ అవుతూ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్నాడు అని చెప్పాలి. ఇప్పుడు మరోసారి కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు బాబర్.


 కెప్టెన్గా అతి తక్కువ ఇన్నింగ్స్ లోనే 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ పదిహేడు ఇన్నింగ్స్ లలో 1000 పరుగులు పూర్తి చేయగా.. ఇప్పుడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ కేవలం 13 ఇన్నింగ్స్ లోనే 1000 పరుగులు పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేయడం గమనార్హం. ఇటీవలే వెస్టిండీస్తో పాకిస్థాన్ వేదికగా జరిగిన వన్డేలో 103 పరుగులు చేసి అదరగొట్టాడు బాబర్. ఈ క్రమంలోనే ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు అనేది తెలుస్తుంది. ఈ లిస్టు లో ఏబీ డివిలియర్స్ 18 ఇన్నింగ్స్ కేన్ విలియమ్సన్ 20 ఇన్నింగ్స్, అలిస్టర్ కుక్21 ఇన్నింగ్స్ లలో  ఈ ఘనత సాధించిన క్రికెటర్లు గా ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: