ఇదేం స్పీడ్ బాసూ.. బ్యాట్ రెండు ముక్కలయింది?

praveen
ఫాస్ట్ బౌలర్లు వేసే బంతుల్ని ఎదుర్కోవడానికి బ్యాట్స్మెన్లు  కొన్నిసార్లు తెగ ఇబ్బంది పడి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఫాస్ట్ బౌలర్లు అత్యంత వేగంతో బంతులు విసురుతూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు వికెట్లు విరిగిపోవడం లాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. కాగా ఇలాంటివి జరిగినప్పుడు అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇక ఇటీవల భారత్ వేదికగా సౌతాఫ్రికా టీమిండియా మధ్య జరిగిన తొలి టీ-20 మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగిందని తెలుస్తోంది.


 భారత బౌలర్ వేసిన బంతి కి ఏకంగా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ బ్యాట్ విరిగిపోయింది. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో చివరికి సౌతాఫ్రికా జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో ఆవేశ్ ఖాన్ వేసిన ఒక బంతి బ్యాట్ ను రెండు ముక్కలు చేసింది. ఇన్నింగ్స్ 14 ఓవర్లో మూడో బంతిని ఆఫ్ సైడ్ దిశగా యార్కర్ వేసాడు ఆవేశ్ ఖాన్. క్రీజులో ఉన్న డుస్సేన్ బంతిని టచ్ చేసే ప్రయత్నం చేశాడు.


బ్యాట్ కు మిడిల్ లో తాకిన బంతి చివరికి బ్యాట్ ను రెండు ముక్కలు చేసుకుంటూ వెళ్ళింది. ఇక ఇది చూసిన డసెన్ తన బ్యాట్ ను పరిశీలించగా ఆవేశ్ ఖాన్ సహా ఆటగాళ్లు అందరూ కూడా నవ్వుకున్నారు. ఇక ఆవేశ్ ఖాన్ బౌలింగ్ వేగం చూసి అందరూ ప్రేక్షకులు అవాక్కయ్యారు అని చెప్పాలి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది ఇంత భారీ స్కోరు చేదించడం కష్టమని సౌత్ ఆఫ్రికా ఓటమి ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం అనూహ్యమైన బ్యాటింగ్తో 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది సౌత్ ఆఫ్రికా..

మరింత సమాచారం తెలుసుకోండి:

Bat

సంబంధిత వార్తలు: