ఐపీఎల్ కలిసొచ్చింది : సౌతాఫ్రికా బ్యాటర్
ఈ క్రమంలోనే ఇంత భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఛేదించగలదా లేదా అని అనుకున్నారు అందరు. ఇలాంటి సమయంలోనే అటు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ వాన్ డెర్ డాసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో అదరగొట్టారు. భారత బౌలర్లపై వీరవిహారం చేసి సౌత్ఆఫ్రికా జట్టుకు విజయాన్ని అందించారు అనే చెప్పాలి ఈ క్రమంలోనే 19.1 ఓవర్లలోనే ఇక భారీ లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది సౌతాఫ్రికా జట్టు. ఇక సౌత్ ఆఫ్రికా విజయం లో మెరుపు ఇన్నింగ్స్ తో కీలకపాత్ర వహించిన వాన్ డెర్ డాసన్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడటం వల్ల భారత పరిస్థితులపై అవగాహన వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ నాకు చాలా ఉపయోగపడింది అంటూ తెలిపాడు. బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారు అనే దానిపై మంచి అవగాహన వచ్చింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సౌత్ ఆఫ్రికాకు చెందిన ఎంతోమంది ప్లేయర్లు ఆడారు. ఇక వారికి కూడా భారత పిచ్ లపై అవగాహన ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో 46 బంతుల్లోనే 75 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు వాన్ డెర్ డాసన్.