వన్డేల్లో అరుదైన రికార్డు.. అదరగొట్టిన వెస్టిండీస్ ఓపెనర్?
వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచార్డ్స్ 88 ఇన్నింగ్స్ లో వన్డేల్లో నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న మైలురాయిని అందుకున్నాడు. ఇక ఇప్పుడు వెస్టిండీస్ ఓపెనర్ శాయ్ హోప్ కూడా సరిగ్గా 88 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించడం గమనార్హం. ఇలా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచార్డ్స్ తో తన రికార్డును సమం చేశాడు షాయ్ హోప్. పాకిస్తాన్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో సెంచరీతో చెలరేగాడు అన్న విషయం తెలిసిందే. మొత్తంగా 127 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అని తెలుస్తోంది..
కాగా 2016 లో వెస్ట్ఇండీస్ తరఫున అరంగేట్రం చేసిన షాయ్ హోప్ ఇప్పటివరకు 88 వన్డే ఇన్నింగ్స్ లో ఆడాడు. ఈ క్రమంలోనే 4026 పరుగులు సాధించాడు. ఇక ఈ లిస్టులో దక్షిణాఫ్రికా దిగ్గజం హషీమ్ ఆమ్లా మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు అనే చెప్పాలి. హషీమ్ ఆమ్లా కేవలం 81 ఇన్నింగ్స్ లోనే నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకోవడం గమనార్హం. ఇక ఆ తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం 82 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించి ప్రస్తుతం అతి తక్కువ ఇన్నింగ్సులో నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ప్రపంచ క్రికెట్ లో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు..