అక్కడ ఉంది నేను కాదు కదా.. హార్థిక్ సింగిల్ తీయాల్సింది?
చివరి ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీసే అవకాశం వచ్చినప్పటికీ కూడా అటు హార్దిక్ పాండ్యా మాత్రం స్ట్రైక్ తనవైపే ఉండేలా చూసుకున్నాడు. దినేష్ కార్తీక్ కు స్ట్రైక్ ఇచ్చేందుకు అస్సలు ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలోనే హార్దిక్ ఎందుకు ఇలా చేశాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఇదే విషయంపై భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆఖరి ఓవర్లలో ఐదో బంతికి సింగిల్ తీసి హార్దిక్ పాండ్యా దినేష్ కార్తీక్ కు స్ట్రైక్ ఇచ్చి ఉండాల్సింది అంటూ చెప్పుకొచ్చాడు.
ఎందుకంటే మరో ఎండ్ లో ఉన్నది నేను కాదు ఇటీవలే ఐపీఎల్ లో అదరగొట్టిన దినేష్ కార్తీక్ అంటూ ఆశిష్ నెహ్రా వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే ఆశిష్ నెహ్రా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహిస్తున్న గుజరాత్ కి హెడ్ కోచ్ వ్యవహరిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇలా ఆశిష్ నెహ్రా హార్థిక్ పాండ్య గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో అదికాస్తా మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.