ఆ సమయంలో పంత్ ఒత్తిడికి గురవుతున్నాడు : వసీం జాఫర్
ఇకపోతే నేడు వైజాగ్ వేదికగా ఇండియా సౌత్ ఆఫ్రికా తో మూడో టి20 మ్యాచ్ ఆడబోతుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా చావోరేవో తేల్చుకోవటానికి సిద్ధమైంది అని చెప్పాలి. ఈక్రమంలోనే రిషబ్ పంత్ తన కెప్టెన్సీ తో ఎలాంటి మాయ చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లోకి చేరినప్పుడు రిషబ్ పంత్ కాస్త ఒత్తిడిలో మునిగిపోతున్నాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు వసీం జాఫర్.
ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా మనం ఇది చూసాము.. కాగా మరిన్ని మ్యాచులకు సారథ్యం వహిస్తే రిషబ్ పంత్ కెప్టెన్సీ మరింత మెరుగు పడుతుంది. అయితే ఇప్పటికే టి20 సిరీస్ చేతిలో నుంచి జారి పోయింది. ఎందుకంటే ఐదు మ్యాచుల సిరీస్లో 2-0 తేడాతో ఇప్పటికే ఆధిక్యంలో కొనసాగుతుంది సౌత్ఆఫ్రికా. ఈ క్రమంలోనే రానున్న మూడు మ్యాచ్ లలో కూడా ఒక మ్యాచ్ లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా సిరీస్ కైవసం చేసుకోవడం జరుగుతుంది. అందుకే రానున్న మూడు మ్యాచ్ లలో కూడా టీం ఇండియా అద్భుతంగా ఆడాల్సిన పరిస్థితి ఉంది అంటు టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.