వావ్.. భువనేశ్వర్ ఖాతాలో అరుదైన రికార్డు?

praveen
టీమిండియాలో డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఎన్నో అరుదైన రికార్డులు సాధిస్తూ వచ్చాడు అన్న విషయం తెలిసిందే. టీమిండియా కష్టాల్లో ఉన్న ప్రతి సారి కూడా తన ప్రదర్శనతో ఎప్పుడు అద్భుతాలు సృష్టిస్తూ వుంటాడు భువనేశ్వర్ కుమార్. ఇక టీమిండియాలో ఎంతో మంది బౌలర్లు ఉన్న భువనేశ్వర్ కుమార్ లా స్వింగ్ బౌలింగ్ వేయడం మాత్రం అసాధ్యం అనే చెప్పాలి.


 ఇకపోతే ప్రస్తుతం ఇండియా సౌత్ఆఫ్రికా తో ఆడుతున్న టీ20 సిరీస్ లో భువనేశ్వర్ కుమార్ ఎంతో కీలకం గా వ్యవహరిస్తున్నాడు. బౌలింగ్ విభాగం మొత్తం విఫలమవుతున్న సమయంలో ఇక భువనేశ్వర్ మాత్రం వరుసగా వికెట్లు పడగొట్టి అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఇటీవల ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మూడవ టీ20 మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది అని చెప్పాలి.


 అయితే ఇక మూడవ టి20 మ్యాచ్ లో ఎంతో కీలకంగా వ్యవహరించిన భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు అన్నది తెలుస్తుంది. టి20 ఫార్మాట్ క్రికెట్ లో పవర్ ప్లే లో ఎక్కువ వికెట్లు తీసిన జాబితాలో భువనేశ్వర్ కుమార్ టాప్ లోకి చేరి పోయాడు. ఈ లిస్టులో వెస్టిండీస్ బౌలర్ శామ్యూల్, టిమ్ సౌదీ లు కూడా ఉన్నారు.  ఇక ఈ ముగ్గురు పవర్ ప్లే లో అత్యధికంగా ముప్పై మూడు వికెట్లు తీసిన బౌలర్ లుగా ఉన్నారు. ఇటీవలే భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు సాధించడంతో వీరిని దాటి టాప్ ప్లేస్ లోకి దూసుకు పోయాను అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీ-20 ఫార్మెట్లో పవర్ ప్లే లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు భువనేశ్వర్ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: