పంత్.. అది మర్చిపోయినట్టున్నాడు : గవాస్కర్

praveen
టీమిండియా సొంతగడ్డపై కూడా సత్తా చాట లేకపోతుంది అన్న విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికా పై ఆధిపత్యం సాధించి క్లీన్ స్వీప్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అటు వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయి అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. చివరికి చావో రేవో తేల్చుకోవాల్సిన 3వ టీ20 మ్యాచ్ లో గెలిచి సిరీస్ పై అవకాశాలను సజీవంగా ఉంచుకుంది అని చెప్పాలి. అయితే మూడవ టి 20 మ్యాచ్ గెలిచింది కానీ ఇంకా టీమిండియాలో సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. ముఖ్యంగా కెప్టెన్ రిషబ్ పేలవమైన ఫామ్ జట్టుకు మైనస్ గా మారిపోతుంది అని చెప్పాలి.


 వరుసగా మూడు మ్యాచ్ లలో అటు రిషబ్ పంత్ చేసిన పరుగులు 25,5, 6 మాత్రమే. దీన్నిబట్టి రిషబ్ పంత్ ఎంత పేలవమైన ప్రదర్శన చేస్తున్నాడో అన్నది అర్థం చేసుకోవచ్చు. అయితే కెప్టెన్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన పై మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిషబ్ పంత్ మైదానంలోకి రాగానే ఫోర్లు సిక్సర్లు కొడతాడు అని ప్రేక్షకులు ఆశిస్తూ ఉంటారు. గత మూడు నాలుగేళ్లలో అతను గొప్పగా రాణించడమే ఇలాంటి అంచనాలు పెట్టుకోవడానికి కారణం. అందువల్లే రిషబ్ పంత్ ఆటపై అభిమానులు నిరాశ చెందుతున్నారు. కొన్నిసార్లు కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా ఆటగాడు తన గురించి తాను ఆలోచించుకోడు. జట్టులోని ఇతర సభ్యులు ఎలా ఆడుతున్నారు అన్నదే ఆలోచిస్తాడు. ఇప్పుడు రిషబ్ పంత్  బ్యాటింగ్ లో సాంకేతిక సమస్యలు   ఉండవచ్చు. కానీ కెప్టెన్సీ ఒత్తిడిలో అతని సమస్యలను గుర్తించడం మర్చిపోయాడు.


 రిషబ్ పంత్ ముందుగా ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూడో టి-20లో మ్యాచ్ లో గెలవడంతో ఒత్తిడి నుంచి రిషబ్ పంత్ కాస్త బయట పడి ఉంటాడు. ఇక ఇప్పుడు అయినా తన బ్యాటింగ్ సమస్య గురించి ఆలోచించుకుంటే బెటర్ అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇక రిషబ్ పంత్ అవుట్ కావడానికి కారణం అవుతున్న షాట్స్ ఆడకుండా ఉండేందుకు రిషబ్ పంత్ ప్రయత్నిస్తే ఆ తర్వాత భారీ షాట్లు ఆడి భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు సునీల్ గవాస్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: