వన్డే మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ.. దంచి కొట్టాడుగా?

praveen
ఇటీవలి కాలంలో ఎంతో మంది క్రికెటర్లు అలవోకగా ప్రపంచ రికార్డులను బ్రేక్ చేస్తూ తమ పేరును లిఖించు కుంటూ  ఉండటం చూస్తూనే ఉన్నారూ. ఇక ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో మరో హిస్టరీ క్రియేట్ అయింది. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న అందుల వన్డే సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా ఆటగాడు ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్లో భాగంగా కివీస్తో జరిగిన మ్యాచ్లో తొలి వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ స్టీఫెన్ నీరో ఏకంగా త్రిబుల్ సెంచరీ సాధించి సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. ప్రస్తుతం టీ20 ల ప్రభావం కారణంగా వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ చేయడమే గగనంగా  మారిపోయింది ప్రతీ ఆటగాడికి.


 ఇలాంటి సమయంలో ఒక అంద క్రికెటర్ ఏకంగా త్రిబుల్ సెంచరీ సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక కామన్వెల్త్ బ్యాంక్ అందుల సిరీస్లో భాగంగా బ్రిస్బేన్  వేదికగా ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో స్టిఫిన్ నీరో  కేవలం 140 బంతుల్లో 49 ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో 309 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తద్వారా నిర్ణీత 40 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 542 పరుగులు చేసింది ఆస్ట్రేలియా జట్టు. ఇక ఇలా భారీ టార్గెట్ తో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ జట్టు కేవలం రెండు వందల డబ్భై రెండు పరుగులు మాత్రమే చేసి చాప చుట్టడం గమనార్హం. ఫలితంగా ఆస్ట్రేలియా 275 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ పై అద్భుతమైన విజయాన్ని సాధించింది.


 అయితే వన్డే క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసినా స్టిఫిన్ నీరో సరికొత్త చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. 1998లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మసూద్ జాన్ చేసిన 262 పరుగుల అందుల వన్డే క్రికెట్ లో టాప్ స్కోర్ గా ఇప్పుడు వరకు కొనసాగింది. కానీ ఇప్పుడు స్టీఫెన్ నీరో మాత్రం విధ్వంసక ఇన్నింగ్స్ తో 309 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు ఈ బ్యాట్స్మెన్. ఆస్ట్రేలియా జట్టు తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదవ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. గతంలో మైకేల్ క్లార్క్, మాథ్యూ హెడెన్, డేవిడ్ వార్నర్ లాంటి దిగ్గజ క్రికెటర్ మాత్రమే వివిధ ఫార్మాట్లలో త్రిబుల్ సెంచరీ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: