ఆరోజు కోహ్లీకి క్షమాపణలు చెప్పా : రహానే
అయితే టీమిండియా కాస్త ఆచితూచి ఆడి ఉంటే.. ఇక మొదటి మ్యాచ్లో కూడా విజయం వరించేది అని అప్పట్లో ఎంతో మంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు అన్న విషయం తెలిసిందే. ఇలా తొలి ఇన్నింగ్స్ లో 53 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం కుప్పకూలిపోయింది. ఇక ఇదే మ్యాచ్లో అప్పుడు వైస్ కెప్టెన్ గా ఉన్న అజింక్యా రహానే చేసిన తప్పిదం మాత్రం అతని పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చేలా చేసింది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు అతను చేసిన చిన్న తప్పిదం ఏకంగా మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది అనే చెప్పాలి. మంచి ఫామ్ లో భారీ పరుగులు చేస్తున్న విరాట్ కోహ్లీ రనౌట్ కావడానికి అజింక్యా రహనే కారణం అయ్యాడు.
అప్పటికే 100 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా. అలాంటి సమయంలో ఒకవైపు అజింక్యా రహానే మరోవైపు విరాట్ కోహ్లీ టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 83 పరుగుల కీలక భాగస్వామ్యం కూడా నమోదు చేశారు. ఇలాంటి సమయంలో కోహ్లీ రనౌట్ అయ్యాడు. అది కూడా అజింక్యా రహానే కారణంగా. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన అజింక్యా రహానే ఆ రోజు కోహ్లీ రన్ ఔట్ అవ్వటం ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చాడు. బౌలర్ వేసిన బంతి బ్యాట్ కు ఎంత ఖచ్చితంగా తగిలిందో అంచనా వేయలేక పోయాను. తేలిగ్గా సింగిల్ వస్తుందని భావించాను. కానీ హేజిల్ వుడ్ పక్కనే ఉండడంతో కోహ్లీ నీ పరుగు రావద్దని చెప్పా.. అప్పటికే అతడు క్రీజును వదిలి వచ్చేసాడు. చివరికి రన్నవుట్ అయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కోహ్లీకి క్షమాపణ చెప్పను అంటు అజింక్య రహానే తెలిపాడు.