టీమిండియా వరల్డ్ కప్ గెలవాలంటే.. అతను జట్టులో ఉండాల్సిందే?
ఇకపోతే ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టి20 ప్రపంచ కప్ లో కూడా దినేష్ కార్తీక్ ను ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్లు, క్రికెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక దినేష్ కార్తీక్ ప్రపంచకప్ లో ఉండాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా మాజీ క్రికెటర్ల ఖాతాలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డెయిల్ స్టేయిన్ కూడా వచ్చి చేరాడు ప్రస్తుత ఫామ్ ను బట్టి రిషబ్ పంత్ కంటే దినేష్ కార్తీక్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడం మంచిది అని నా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లో దినేష్ కార్తీక్ బాగా ఆడుతున్నాడు.
కీలక ఆటగాళ్లు విఫలమవుతున్న సమయంలో దినేష్ కార్తీక్ మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఇక భారత జట్టు టి-20 ప్రపంచ కప్ గెలవాలంటే దినేష్ కార్తిక్ తప్పకుండా జట్టులో ఉండాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం దినేష్ కార్తీక్ తన కెరీర్లోనే అత్యుత్తమ మైన ఫామ్ లో కొనసాగుతున్నాడు అంటూ డేల్ స్టెయిన్ చెప్పుకొచ్చాడు. అటు భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ సైతం దినేష్ కార్తీక్ ను అటు టి-20 ప్రపంచకప్ జట్టులో చూడాలని అనుకుంటున్నామూ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు అనే విషయం తెలిసిందే.