ఐపీఎల్ విలువ లక్ష కోట్లు.. లీగ్ సృష్టికర్త ఆసక్తికర వ్యాఖ్యలు?
ఐపీఎల్ ప్రారంభమైందంటే చాలు తమ దేశ క్రికెట్ బోర్డు పర్మిషన్ తీసుకుని మరి ఐపీఎల్ లో పాల్గొంటూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఐపీఎల్ లో భారత ఆటగాళ్ల కంటే విదేశీ ఆటగాళ్లదే ఎక్కువగా హవా నడుస్తోంది. ఇక ఐపీఎల్ లో పాల్గొంటే కోట్ల రూపాయల ఆదాయంతో పాటు మంచి అనుభవం కూడా సాధించవచ్చు అని భావిస్తూ ఉంటారు. అయితే ఇటీవలే ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం జరగగా ఈ వేలంలో బిసిసిఐకి దక్కిన ప్రసార హక్కుల విలువతో ఐపీఎల్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏకంగా ప్రసార హక్కుల కు గాను 48 వేల మూడు వందల తొంభై కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది బిసిసిఐకి.
కాగా ఇలా ఒక్కో మ్యాచ్ విలువ 107 కోట్ల రూపాయలు గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ విలువ పెరుగుతుందని మొదట్లో చెబితే అందరూ తనను చూసి నవ్వారూ అని.. కానీ ఇప్పుడు వాళ్లే ముక్కున వేలేసుకుంటున్నారు అంటూ లలిత్ మోడీ చెప్పుకొచ్చాడు. 2023-27 కాలానికి ఐపీఎల్ ప్రసార హక్కుల విలువ 48390 కోట్లు కాగా.. ఇక ఆ తర్వాత పిరియడ్ 2027-31 కాలానికి గాను ఐపీఎల్ విలువ లక్ష కోట్లు పెరగడం ఖాయం అంటూ చెప్పుకొచ్చాడు లలిత్ మోడీ. ఐపీఎల్‌కు ప్రతి ఏటా కొత్త అభిమానులు వస్తున్నారని వారిని ఎంగేజ్ చేయడంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించాడు.