ట్రెండ్ మారుతుంది.. బుమ్రాకు కెప్టెన్సీపై ముంబై కోచ్?
ఇటీవలే బుమ్రా భార్య సంజన గణేశన్ తో ఐసీసీ నిర్వహించిన చిట్ చాట్ లో భాగంగా మాట్లాడిన జయవర్ధనే బుమ్రాను కెప్టెన్ గా నియమించడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇది అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్ లకు కెప్టెన్ గా నియమించడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక ఫాస్ట్ బౌలర్ జట్టు కెప్టెన్ గా ఉండాలంటే ఎంతో కష్టపడాలి. టెస్ట్ క్రికెట్ లో అయితే అనేక సవాళ్ళతో కోరుకున్నది. ఇక బుమ్రా టెస్ట్ కెప్టెన్సీ కి సరైన వాడు. గత కొన్నేళ్లుగా ట్రెండ్ మారుతోంది. ఆస్ట్రేలియాకు పాట్ కమ్మిన్స్ కెప్టెన్ గా మారిన తర్వాత మిగతా దేశాల క్రికెట్ బోర్డులు అదే దారిలో వెళ్లేందుకు ఆలోచన చేస్తున్నాయ్. బౌలర్ కెప్టెన్ గా ఉండడం గొప్ప విషయం. ఎందుకంటే ఆట ఎలా సాగుతుందో చూస్తారు.. దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. జట్టు కోసం ఏదైనా చేయాలి అనే ఆలోచన లోనే ఉంటారు.
అదికాక ఫాస్ట్ బౌలర్ కెప్టెన్ అయితే ఎప్పుడు వికెట్ల మీదే ద్యాస ఉంటుంది. ఇక బుమ్రాకు టెస్ట్ క్రికెట్ అంటే ఎంతో మక్కువ ఐపీఎల్ సమయంలో చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని నాతో పంచుకున్నాడు. పరిమిత ఓవర్ల కంటే టెస్ట్ క్రికెట్ ఆడటం ఎంతో ఇష్టం.. ఒక్క మ్యాచ్ కూడా మిస్ చేయకుండా ఆడాలి అని అతను అనుకుంటూ ఉంటాడు అని చెప్పుకొచ్చాడు జయవర్ధనే.