రిషబ్ పంత్ సెంచరీ.. కానీ అది మర్చిపోయినట్టున్నాడే?

praveen
ప్రస్తుతం ఇంగ్లాండ్తో రీషెడ్యూల్ చేయబడిన టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది  టీమిండియా. దీనికి జస్ప్రిత్ బూమ్రా కెప్టెన్సీ వహిస్తున్నాడు. టెస్ట్ మ్యాచ్లో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే  మ్యాచ్ డ్రాగా అయినా ముగించాలి. లేదంటే ఇక సిరీస్ను కైవసం చేసుకోవడం కష్టం అని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేస్తుందని  అభిమానులు అందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో అటు టీమిండియా బ్యాటింగ్ విభాగం పూర్తిగా నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే.


 టెస్ట్ మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో ఇక టీమిండియా ప్రదర్శన చూసి ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. ఆ సమయంలోనే క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఎంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా రిషబ్ పంత్ అయితే ఏకంగా ఇంగ్లాండ్ బౌలర్లపై వీరవిహారం చేశాడు అని చెప్పాలి. ఏకంగా 107 బంతుల్లోనే 146 పరుగులు చేశాడు రిషబ్ పంత్. సాధారణంగా టెస్ట్ మ్యాచ్ అంటే ఎవరైనా సరే ఆచితూచి ఆడుతూ ఉంటారు.


 దూకుడుగా ఆడకుండా  నెమ్మదిగా ఆడుతూ పరుగుల సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ బ్యాటింగ్ చేయడానికి వచ్చిన రిషబ్ పంత్ మాత్రం తాను ఆడుతున్నది టెస్ట్ మ్యాచ్ అన్న విషయాన్ని మర్చిపోయినట్లున్నాడు. ఎందుకంటే సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయాడు. టి20 ఫార్మట్ తరహాలో వీరవిహారం చేశాడు. అంతేకాదు మొన్నటి వరకు పేలవా ఫామ్లో ఉన్న రిషబ్ పంత్ ను విషయం పక్కన పెట్టాలి అంటూ చెప్పినవారికి తన బ్యాట్ తోనే సాలిడ్ సమాధానం ఇచ్చేసాడు రిషబ్ పంత్. ఇక ఇటీవల రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం  ఎంతో కీలకం గా మారిపోయింది అని చెప్పాలి. ఇక రెండో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఎలాంటి బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: