విరాట్ కోహ్లీ ఫామ్ పై జోరుగా విమర్శలు !

VAMSI
ఇప్పుడు ఇండియా క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. అందులో భాగంగా గతంలో రద్దైన ఆఖరి టెస్ట్ మ్యాచ్ మరియు మూడు టీ 20 లు మరియు మూడు వన్ డే లను ఆడనుంది. అందులో భాగంగా టెస్ట్ మ్యాచ్ మొదలై మూడు రోజులు గడిచింది. అయితే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి చూస్తే ఇండియా బలమైన స్థితిలో ఉంది. రెండవ ఇన్నింగ్స్ లో 125 పరుగులు చేసి ముగ్గురు ప్రధానమైన ప్లేయర్ లను కోల్పోయింది. ఇక ఎప్పట్లాగే కోహ్లీ తన పేలవమైన ఆటను ఆడాడు. దొరికిన మంచి స్టార్ట్ ను భారీ స్కోర్ గా మలచడంలో ఫెయిల్ అయ్యాడు. ఓపెనర్ పుజారా తో కలిసి చక్కగా ఆడుతున్న సమయంలో స్టోక్స్ ఓవర్ లో రూట్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
ఇక మొదటి ఇన్నింగ్స్ లో అయితే 11 పరుగులకే అవుట్ అయిన సంగతి తెలిసిందే. 2019 నవంబర్ నుండి ఈ రోజుకి కోహ్లీ ఏ ఫార్మాట్ లో అయినా సెంచరీ చేసింది లేదు. ఫామ్ లో లేకపోవడం వలనే తాను అన్ని ఫార్మాట్ లకు కెప్టెన్ గా రాజీనామా చేశాడు. అయితే తన అభిమానుల నుండి మాత్రం తనకు మద్దతు ఇంకా ఉండడం గమనార్హం. తాను ఫామ్ లో ఉన్నా లేకపోయినా, అభిమానులు అదే ఉత్సాహంతో తనను సపోర్ట్ చేస్తున్నారు.
అయితే ఎందుకు ఇలా కోహ్లీ ఫెయిల్ అవుతున్నాడు అన్నది టీం ఇండియా యాజమాన్యాన్ని ఎంతగానో కలవరపరుస్తోంది. ఇక ఇండియా మాజీ ప్లేయర్స్ అయితే కోహ్లీ కనీసం దేశవాళీ టోర్నీలలో ఆడి ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నారు. అయితే ఇంగ్లాండ్ సిరీస్ అయిన తరువాత ఏదైనా దేశంలో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి తానేంటో  ప్రూవ్ చేసుకోవాలి. మరి కోహ్లీ ఈ తన ఫామ్ పట్ల వస్తున్న ఈ విమర్శల నుండి ఎలా బయట పడతాడు అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: