మొదటి టీ 20 : ఇరు జట్లలో 'బీస్ట్ ' మోడ్ ప్లేయర్స్ వీరే?
అందుకు ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరియు కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రణాళికలను రచిస్తున్నారు. ఇక ఇటీవల కరోనా కారణంగా రోహిత్ శర్మ మొన్న జరిగిన టెస్ట్ కు దూరం అయ్యాడు. ఇప్పుడు కోలుకుని ఈ మ్యాచ్ లో రంగంలోకి దిగుతున్నాడు. అయితే ఇప్పుడు అందరి దృష్టి రెండు జట్లలో ఉన్న అరవీర భయంకరమైన బీస్ట్ మోడ్ ప్లేయర్ లపై పడింది. ముఖ్యంగా... ఈ మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురవడం ఖాయం అని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్లలో ఉన్న బీస్ట్ మోడ్ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఇంగ్లాండ్: ఇటీవల వైట్ బాల్ కెప్టెన్ గా ఉన్న మోర్గాన్ తప్పుకున్న విషయం తెల్సిందే. దీనితో బట్లర్ ను ఇసిబి కెప్టెన్ గా నియమించింది. ఇది బట్లర్ కు కెప్టెన్ గా మొదటి సీరీస్ కూడా కావడం గమనార్హం. ఐపీఎల్ లో బట్లర్ ఏ విధంగా బౌలర్లపై ఒక బీస్ట్ లాగా విరుచుకుపడ్డాడు అన్నది చూశాము. ఈ తరహాలో కనుక ఆడితే ఇండియాకు ఓటమి ఖాయం. ఇక ఇదే రేంజ్ లో ఆడగల సత్తా ఉన్న ప్లేయర్ లివింగ్స్టన్... వచ్చిన ప్రతీ బంతిని సిక్సర్ గా మలచగల నైపుణ్యం ఇతని సొంతం. వీరిద్దరూ కాకుండా మొయిన్ అలీ, రాయ్ లు చేరేగగాల సిద్దహస్తులు.
ఇండియా: ఇండియాలో అందరికీ బీస్ట్ మోడ్ లో ఆడే సత్తా ఉన్నప్పటికి... నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో చాలా కాలంగా ఫామ్ కోల్పోయిన రోహిత్ శర్మ పై అందరి దృష్టి ఉంది. ఇక హార్దిక్ పాండ్య, దినేష్ కార్తీక్, దీపక్ హూడా, శాంసన్ లు కూడా బ్యాట్ ను జులిపించగలరు. మరి చూద్దాం ఈ రో జూ జరగనున్న మ్యాచ్ లో సక్సెస్ అయ్యే బీస్ట్ ఆటగాళ్లు ఎవరు ?