ధోనికి కోహ్లీ బర్త్ డే విషెస్.. ఎలా చెప్పాడంటే?
అభిమానులకే కాదు మాజీ క్రికెటర్ కు ప్రస్తుత క్రికెటర్లకు కూడా ఇష్టమైన వాడు.. ఎంతోమందిలో స్ఫూర్తిని నింపిన వాడు. ఎంతోమందిని మెరుగైన క్రికెటర్ల గా తయారు చేసిన వాడు మహేంద్రసింగ్ ధోని. దీంతో మాజీ క్రికెటర్ల దగ్గర నుంచి యువ క్రికెటర్ల వరకు అందరూ ధోనీకి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలో ఇటీవల మిస్టర్ అగ్రేసీవ్ గా గుర్తింపు సంపాదించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ.. మిస్టర్ కూల్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో తాను ధోని కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ధోని మరవలేని నాయకుడు.. భారత క్రికెట్ కోసం మీరు చేసిన దానికి ధన్యవాదాలు.. నాకు అన్నయ్య అలా తయారయ్యావు.. ఎల్లప్పుడూ ప్రేమ అభిమానం తప్ప మరేమీ లేదు.. హ్యాపీ బర్తడే స్కీప్ అంటూ సోషల్ మీడియాలో ధోని కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు విరాట్ కోహ్లీ. అయితే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తర్వాత మెరుగైన క్రికెటర్గా ఎదగడంలో ధోని ఎంతో సహాయ సహకారాలు అందించాడు అనే చెప్పాలి. ధోని సారథ్యంలోనే తనబ్యాటింగ్ కి మరింత మెరుగులు దిద్దుకుంటూ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్గా విరాట్ కోహ్లీ ఎదిగాడు. ఇక వీరిద్దరి మధ్య స్నేహబంధం కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉంటుంది.