
బజ్ బాల్ అంటే ఏంటి.. ప్రపంచ క్రికెట్లో ఇదే చర్చ?
సాధారణంగా సుదీర్ఘమైన టెస్టు ఫార్మాట్ అంటే ఆటగాళ్లు ఎంతో ఆచితూచి ఆడుతూ నెమ్మదిగా పరుగులు చేస్తూ ఉంటారు. ఆటగాళ్ళ స్ట్రైక్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది. కానీ బజ్ బాల్ అంటే మాత్రం ప్రత్యర్థులకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ఎటాకింగ్ మోడ్లోకి వెళ్లిపోవడమే. ఇప్పటికే మొన్న న్యూజిలాండ్ పై టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ జట్టు ఇదే వ్యూహాన్ని ఆచరణలో పెట్టింది. న్యూజిలాండ్ నిర్దేశించిన టార్గెట్ ను బెన్ స్టోక్స్, మెకల్లమ్ ఆధ్వర్యంలోనే ఇంగ్లాండ్ జట్టు బజ్ బాల్ విధానంలో ఎంతో అవలీలగా ఛేదించింది అని చెప్పాలి. ఇటీవల ఇండియా తో జరిగిన రీషెడ్యూల్ టెస్టుల్లో కూడా ఇలాంటి వ్యూహాన్ని ఫాలో అయింది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు నెమ్మదిగా ఆడుతూ వికెట్ కాపాడుకోవడం కంటే ఎటాకింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయి ఆరు ఫోర్లతో చెలరేగిపోయింది. ఇక ఇలా టెస్ట్ క్రికెట్ లో గెలుపే లక్ష్యంగా ఎటాకింగ్ మోడ్ లో బ్యాటింగ్ చేయడమే బజ్ బాల్ అంటారు. మెచేలెన్, బెన్ స్టోక్స్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక ఈ వ్యూహాన్ని ఎంతో పకడ్బందీగా ఆచరణలో పెడుతున్నారని తెలుస్తోంది. ఈ ట్రెండ్ తెరమీదకు రావడంతో టెస్ట్ క్రికెట్ కు సరికొత్త శోభను సంతరించుకుంటోంది అనేది తెలుస్తుంది. ఈ సరికొత్త అప్రోచ్ వల్ల టెస్ట్ క్రికెట్ కళ తప్పుతుందని మరికొంతమంది భావిస్తున్నారు.