రోహిత్ అదరహో.. ఓకే మ్యాచ్.. 2 వరల్డ్ రికార్డ్ లు?

praveen
ఎవరూ ఊహించని విధంగా  టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు రోహిత్ శర్మ. మొదట కేవలం పరిమిత ఓవర్ల కెప్టెన్సీ అందుకున్న రోహిత్ శర్మ ఆ తర్వాత టెస్ట్ కెప్టెన్సీ కూడా చేపట్టాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఇక టీమిండియాను అతను ఎలా ముందుకు నడిపిస్తున్నాడో అనేది ఆసక్తికరం గా మారిపోయింది. ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ  అదరగొట్టేశాడు అన్న విషయం తెలిసిందే.


 ఇప్పటివరకు రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియాతో ఆడిన ఒక్క మ్యాచ్లో కూడా పరాజయం పాలు కాలేదు. ఇటీవల ఇంగ్లాండ్ గడ్డపై రోహిత్ శర్మ కెప్టెన్సీ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తితో చూపారు. ఈ క్రమంలోనే 50 పరుగుల తేడాతో టీమిండియాకు విజయాన్ని అందించాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే ఒక అరుదైన ఘనత సాధించాడు అన్నది తెలుస్తుంది. క్రికెట్ చరిత్రలోనే ఏ కెప్టెన్ సాధించనీ ఘనత ప్రస్తుతం రోహిత్ శర్మ ఖాతాలో చేరిపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ లో వరుసగా 13 టి20 మ్యాచ్ లలో విజయకేతనం ఎగురవేసింది టీమిండియా.


 ఇలా తమ కెప్టెన్సీలో వరుసగా 13 మ్యాచ్ల్లో జట్టుకు విజయాలు సాధించిపెట్టినా తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. అంతేకాదు కెప్టెన్గా రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశాడు. కెప్టెన్గా టీ20లో 1000 పరుగుల మార్కును అందుకున్నాడు. అయితే కేవలం 28 మ్యాచ్లోనే రోహిత్ శర్మ ఈ ఘనత సాధించడం గమనార్హం. దీంతో విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టాడు రోహిత్ శర్మ.  విరాట్ కోహ్లీ 30 మ్యాచ్ లలో కెప్టెన్గా 1000 పరుగులు చేస్తే.. రోహిత్ శర్మ మాత్రమే 28 మ్యాచ్ లలోనే ఈ రికార్డు సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: