వావ్.. టెస్ట్ చరిత్రలో.. అరుదైన రికార్డు?
అయితే ఇలా ఫామ్ కోల్పోయి స్టీవ్ స్మిత్ ఇబ్బందిపడుతున్నప్పటికీ అటు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మాత్రం అతనికి వరుస అవకాశాలు ఇస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అనేది తెలుస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు శ్రీలంక పర్యటన లో ఉంది అన్న విషయం తెలిసిందే. అక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో భాగంగా ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శన చేస్తోంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో మళ్ళీ మునుపటి ఫామ్ అందుకుని అరుదైన రికార్డును సాధించాడు స్మిత్.
టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ చరిత్రలో కేవలం 87 మ్యాచ్ లు మాత్రమే ఆడి 28 సెంచరీలు చేసిన రెండవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన స్మిత్ ఈ ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ లిస్టులో చూసుకుంటే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ మన్ 29 సెంచరీలు చేసి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే స్టీవ్ స్మిత్ మరో రెండు సెంచరీలు చేసి ఏకంగా ప్రపంచ రికార్డును తిరగ రాస్తాడు అని అభిమానులందరూ బలంగా నమ్ముతున్నారు. అంతేకాదు స్మిత్ మళ్లీ ఫామ్లోకి రావడం.. సెంచరీతో అదరగొట్టడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.