"దూకుడు... దూకుడు.." ఇంగ్లాండ్ ఓటమికి ప్రధాన కారణం !

VAMSI
ఈ రోజు సాయంత్రం గంటలకు ఇంగ్లాండ్ తో ఇండియా రెండవ టీ 20 ఆడనుంది. మొన్న జరిగిన మొదటి మ్యాచ్ లో ఇండియా చేతిలో ఘోరాతి ఘోరముగా ఇంగ్లాండ్ ఓటమి పాలయింది. సో ఇప్పుడు ప్రత్యర్థి ప్రతీకారంతో రగిలిపోతున్నారు అని చెప్పాలి. కాగా ఈ రోజు టీం తో కోహ్లీ, పంత్ , బుమ్రా లాంటి ఆటగాళ్లు వచ్చి కలవనున్నారు.
 మొన్న యువకులతో కూడిన ఇండియాను ఓడించడమే వారి వల్ల కాలేదు. మరి ఇప్పుడు స్టార్ లతో నిండనున్న టీం ను ఓడించగలదా అని క్రికెట్ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. మొదటి సారి రెగ్యులర్ కెప్టెన్ గా మారిన బట్లర్ కు మొన్న మ్యాచ్ లో నిరాశ ఎదురైంది. కాబట్టి తన మొదటి విజయం కోసం ఇంకా నిరీక్షణ తప్పేలా లేదు.

అయితే ఇంగ్లాండ్ కొన్ని విషయాలు గుర్తుంచుకుని బరిలోకి దిగితే విజయం దక్కే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బట్లర్, లివింగ్స్టన్, మలన్ లు ఆరంభంలో వికెట్ ఇచేయకుండా కొన్ని ఓవర్ లపాటు నెమ్మదిగా ఆడితే వాటంతట ఏవ్ పరుగులు వస్తాయి. కానీ దూకుడు దూకుడు అని ఓటమిని కొని తెచ్చుకుంటున్నారు. ఆట పరిస్థితిని బట్టి ఆడే విధానాన్ని మార్చుకోవాలి. అంతే కానీ అవసరం లేకుండా అనవసరపు షాట్ లు ఆడితే మొన్న వచ్చిన ఫలితమే పునరావృతం అవుతుంది. దీనికి సరైన ఉదాహరణ మొదటి టీ 20 అని చెప్పాలి.  

ఇక ఇండియా టీం లో కూడా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా అంచనాలకు తగినట్లుగా ఆడాల్సి ఉంది. ఈ రోజు మ్యాచ్ లో బరిలోకి దిగుతున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వస్తే ఇంగ్లాండ్ కు చుక్కలు చూపిస్తాడు. ఈ రోజు  జరగనున్న మ్యాచ్ లో ఇండియా సిరీస్ ను గెలుచుకుంటుందా లేదా ఇంగ్లాండ్ గెలిచి సిరీస్ డిసైడర్ కు తీసుకువెళ్తుందా అన్నది చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: