నేడే మొదటి వన్డే.. ఇండియా అదే జోరు కొనసాగిస్తుందా?
ఇక మూడో మ్యాచ్లో మాత్రం అటు ఇంగ్లండ్ జట్టు పుంజుకోవడంతో టీమ్ ఇండియాకు ఓటమి తప్పలేదు. ఇదిలా ఉంటే నేటి నుంచి ఇక ఇంగ్లాండ్ టీమిండియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ వన్డే సిరీస్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. టి 20 సిరీస్ గెలిచిన జోష్ లో ఇప్పుడు మూడు వన్డేల సిరీస్కు సిద్ధమైంది టీమిండియా. ఇక తొలి వన్డే మ్యాచ్ నేడు సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభం కాబోతుంది. సోనీ నెట్వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం కాబోతుంది అన్నది తెలుస్తుంది.
ఈ క్రమంలోనే తొలి మ్యాచ్లోనే విజయం సాధించి ఆధిక్యాన్ని కొనసాగించాలని రోహిత్ భావిస్తుండగా.. టీ20 సిరీస్ ఓడిపోయి ఇక ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్న ఇంగ్లండ్ జట్టు మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంది. అంతే కాదు ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన జోస్ బట్లర్ కూడా తన కెప్టెన్సీని మార్కు చూపించాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. దీంతో ఇక అటు వన్డే సిరీస్ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది అన్నది మాత్రం తెలుస్తోంది. ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు గెలవబోతున్నారో అన్నది కూడా ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి.