"రోహిత్ - ధావన్" లు మిగతా వాళ్లకు ఆడే ఛాన్స్ ఇస్తారా ?
అయితే ఇప్పుడు రెండవ వన్ డే కొనసాగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇంగ్లాండ్ తడబడుతూ ఆడుతోంది. ఇప్పటికే సగం వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఈ పరిస్థితిలో ఎంత వరకు ఇండియా ముందు ఫైటింగ్ టోటల్ ఉంచుతారు అన్నది తెలియదు. ఇప్పుడు క్రీజులో ఉన్న లివింగ్ స్టన్ మరియు మొయిన్ అలీ లు కనుక వికెట్ పడకుండా పూర్తి ఓవర్ లు ఆడితే గౌరవప్రదమైన స్కోర్ ను ఇండియా ముందు ఉంచగలదు. లేదా 200 కు కూడా ఆల్ అవుట్ అయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు.
కానీ టార్గెట్ ఎంత అయినా గత మ్యాచ్ లాగా ఓపెనర్లు రోహిత్ ధావన్ లే ఊదేస్తారా లేదా మిగిలిన ప్లేయర్లకు కనీసం ఆడే అవకాశం ఇస్తారా అన్నది ఇక్కడ చాలా మంది ఇండియన్స్ సందేహం. ఎందుకంటే రోహిత్ గత మ్యాచ్ లో ఆడిన తీరు చూస్తే ఫుల్ ఫామ్ కి వచ్చినట్టున్నాడు. ఇక గబ్బర్ ఎప్పటిలాగే డీసెంట్ క్లాస్ బ్యాటింగ్ నిలకడగా ఆడుతున్నాడు. మరి చూద్దాం... మరో ఘన విజయం దక్కుతుందా లేదా ఇంగ్లాండ్ పోటీ ఇస్తుందా ?