రీ ఎంట్రీలోనే అదుర్స్.. అరుదైన రికార్డ్?

praveen
ఇటీవల కాలంలో అంతర్జాతీయ జట్టులో ఫామ్ లేమి కారణంగా దూరమైన ఎంతో మంది ఆటగాళ్లు మళ్ళీ జట్టులో ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందో.. ఎప్పుడు మళ్లీ తన సత్తా చాటుతామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు ఎంతోమంది సీనియర్లు. కాగా ఇటీవలే పాకిస్తాన్ సీనియర్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా సైతం రీఎంట్రీ మ్యాచ్లోనే అదిరిపోయే ప్రదర్శన చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో  ఏకంగా  రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.



 పాకిస్థాన్ జట్టు తరఫున టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ఐదవ స్థానానికి చేరుకున్నాడు.  ఇప్పటివరకు తన టెస్టు కెరీర్లో 237 వికెట్లు పడగొట్టాడు. తద్వారా 5వ స్థానంలో కొనసాగుతున్న అబ్దుల్ ఖాదిర్ 236 వికెట్లను దాటేసి 5వ స్థానానికి వచ్చేశాడు. కాగా యాసిర్ షా కంటే ముందు..దిగ్గజ బౌలర్లు వసీమ్‌ అక్రమ్‌(414 వికెట్లు), వకార్‌ యూనిస్‌(373 వికెట్లు), ఇమ్రాన్‌ ఖాన్‌(362 వికెట్లు), దానిష్‌ కనేరియా(261) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు అని చెప్పాలి.


 యాసిర్ షా  పాకిస్తాన్ క్రికెట్ లో పెను సంచలనం అనే చెప్పాలి. వైవిధ్యమైన బౌలింగ్ తో ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 2014లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఈ లెగ్ స్పిన్నర్ పాకిస్తాన్ తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. అంతేకాదు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా వంద వికెట్ల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా అరుదైన రికార్డు సాధించాడు. అత్యంత వేగంగా రెండు వందల వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దాదాపు ఏడాది విరామం తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చి మరోసారి అదరగొట్టాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: