మొన్న బద్ధ శత్రువులు.. ఇప్పుడు కలిసిపోయారు?
ఇలా మైదానంలో మాటల యుద్ధం తర్వాత స్పందించిన బెయిర్ స్టో మైదానంలో ఇలాంటివి సహజమేనని.. ఎవరు ఎంత మాటల యుద్ధానికి దిగిన కేవలం జట్టును గెలిపించడం కోసమేనని ఇక మైదానంలో ఎంతలా స్లెడ్జింగ్ చేసుకున్న బయట మాత్రం స్నేహితుల్లా ఉంటామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ స్పందించాడు. ఇకపోతే మొన్నటికి మొన్న మైదానంలో బద్ధశత్రువుగా కనిపించిన కోహ్లీ, బెయిర్ స్టో ఇటీవల లార్డ్స్ వేదికగా జరిగిన వన్డే కు ముందు మళ్లీ స్నేహితులుగా కలిసిపోయినట్లు గానే కనిపించారు.
జానీ బెయిర్ స్టో మైదానం నుంచి బయటకు వెళ్తూ ఉండగా విరాట్ కోహ్లీ అప్పుడే మైదానంలోకి వస్తున్నాడు. ఈ సమయంలోనే ఇద్దరు కలిసి చేయి చేయి కలుపుతారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే చోట నిలబడి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇక వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ఫీల్డులో ఉన్న అభిమానులకు కూడా దృశ్యం బాగా నచ్చింది అని చెప్పాలి. దీంతో ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ గా మారిపోయింది. ఇక ఇది చూసిన తర్వాత మైదానంలో ఆటగాళ్లు ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ ఎంత మాటల యుద్ధం జరిగినప్పటికీ బయట మాత్రం కలిసిపోతారు అర్థం అవుతుంది అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.