సూపర్ సెంచరీ.. ధోని క్లబ్ లో చేరిన పంత్?

praveen
గత కొంత కాలం నుంచి రిషబ్ పంత్  అద్భుతమైన ఫామ్ తో అదరగొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా బ్యాట్స్మెన్ గా తన సత్తా ఏంటి అన్న విషయాన్ని నిరూపిస్తున్నాడు. సెంచరీలతో చెలరేగిన పోతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఆడిన టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించి ఇక ఎన్నో రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు రిషబ్ పంత్. ఇప్పుడు వన్డే మ్యాచ్లో కూడా రిషబ్ పంత్ అదిరిపోయే సెంచరీతో  ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్ టీం ఇండియా మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్లో కూడా రిషబ్ పంత్ సెంచరీ తో చెలరేగిపోయి టీమిండియాను విజయతీరాలకు నడిపించాడు.


 ఈ క్రమంలోనే మూడో మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా 2-1 తేడాతో వేగంగా ఇంగ్లాండ్ జట్టును ఓడించి సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు రిషబ్ పంత్ కెరీర్ లోని తొలి వన్డే సెంచరీ సాధించాడు. హార్థిక్ పాండ్య  కూడా తన కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. నాలుగు ఓవర్లు వేసి 24 పరుగులు మాత్రమే ఇచ్చిన నాలుగు వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ లో 76 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపించింది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇటీవల సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్ మాజీ వికెట్కీపర్ బ్యాట్స్మన్ మహేంద్రసింగ్ ధోని క్లబ్ లో ప్రవేశించాడు అని చెప్పాలి. వన్డే ఫార్మాట్ క్రికెట్లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సెంచరీ సాధించిన మూడో బ్యాట్స్మెన్గా రెండో వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ నిలిచాడు. పంత్ కంటే ముందు మహేంద్ర సింగ్ ధోనీ 2005లో శ్రీలంకపై లక్ష్యాన్ని ఛేదించే సమయంలో 183 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇక ఇప్పుడు వన్డే ఫార్మాట్లో పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సెంచరీ సాధించిన భారత వికెట్ కీపర్గా రెండవ స్థానంలో రిషబ్ పంత్ నిలిచాడు. అయితే 2002లో వెస్టిండీస్పై వన్డే ఫార్మాట్లో లక్ష్య ఛేదన సమయంలో రాహుల్ ద్రావిడ్ 109 పరుగులు చేసి సెంచరీతో అదరగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: