అభిమానులకు షాక్.. స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్?

praveen
ఇటీవలే వెస్టిండీస్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఎందుకంటే వెస్టిండీస్ క్రికెట్ లో స్టార్ ప్లేయర్ గా ఎదిగిన ఆటగాడు చివరికి తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటిస్తు నిర్ణయం తీసుకున్నాడు.. ఇలా ఇటీవలి కాలంలో ఎంతో మంది ఆటగాళ్లు తమ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాక్ ఇస్తూ ఉండగా ఇక్కడ విధ్వంసకర వెస్టిండీస్ ఓపెనర్ లెండిల్ సిమన్స్ కూడా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇక ఇలా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అన్న విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చాడు లెండిల్ సిమన్స్. కాగా లెండిల్ సిమన్స్  గత ఏడాది టీ20 ప్రపంచకప్ లో చివరిసారిగా వెస్టిండీస్ జట్టు తరఫున ఆడాడు.


 ఇక ఆ తర్వాత సరైన ప్రదర్శన లేకపోవడంతో అతన్ని  జట్టులోకి తీసుకోలేదు అన్న విషయం తెలిసిందే. 2006లో పాకిస్థాన్తో జరిగిన వన్డే మ్యాచ్లో వెస్టిండీస్ తరుపున లెండిల్ సిమన్స్ అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. భారీ అంచనాల మధ్య వెస్టిండీస్ జట్టులో అవకాశం దక్కించుకున్న ఈ స్టార్ ఓపెనర్  మొదటి మ్యాచ్ లోనే డకౌట్ అయ్యాడు. తీవ్రంగా నిరాశపరిచాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆ తర్వాత కాలంలో మాత్రం అటు వెస్టిండీస్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు లెండిల్ సిమన్స్. ఈ క్రమంలోనే వన్డేలు టెస్టులు మాత్రమే టి20 ఫార్మాట్ లో కూడా వెస్టిండీస్ జట్టులో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా గుర్తింపు సంపాదించాడు.


 అంతేకాదు  రెండు సార్లు ప్రపంచ కప్ గెలిచిన వెస్టిండీస్ జట్టు లో కూడా భాగంగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. 2016 లో టి20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో భాగంగా భారత్ తో  జరిగిన మ్యాచ్లో 82 పరుగులతో లెండిల్ సిమన్స్ అద్భుతమైన ప్రదర్శన చేసి అదరగొట్టాడు. ఇక మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ లో 144 మ్యాచ్ లు ఆడాడు లెండిల్ సిమన్స్. 3723 పరుగులు సాధించాడు. అయితే విధ్వంసకర ఆటగాడు గా పేరు తెచ్చుకున్న ఈ స్టార్ బ్యాట్స్ మన్ పలు ఫ్రాంచైజీ  టోర్నీలో కూడా ఆడి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఐపీఎల్ లో కూడా ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించిన లెండిల్ సిమన్స్ 2015 సీజన్లు 546 పరుగులు చేసి ఆ జట్టు టాప్ స్కోరర్ గా నిలిచాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: