క్యా సీన్ హై.. ఝాలన్ గోస్వామి బౌలింగ్ లో కె.ఎల్.రాహుల్ బ్యాటింగ్?
ఇటీవలే జర్మనీలో శస్త్రచికిత్స చేయించుకున్న కె.ఎల్.రాహుల్ ప్రస్తుతం కోలుకున్నాడు. ఈ క్రమంలోనే ఫిట్నెస్ సాధించేందుకు బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు. కాగా ఇటీవలే గాయం బారినపడిన భారత మహిళా క్రికెటర్ ఝాలన్ గోస్వామి కూడా నేషనల్ క్రికెట్ అకాడమీ లోనే ప్రస్తుతం ఫిట్నెస్ సాధించే పనిలో నిమగ్నమై ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే వీరిద్దరూ కలిసి నెట్ ప్రాక్టీస్ చేశారు. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తూ ఉన్న సమయంలో ఇక మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి బౌలింగ్ చేసింది.
ఈ క్రమంలోనే తనదైన శైలిలో కవర్ డ్రైవ్, బ్యాక్ ఫుట్ షాట్ లతో అలరించాడు కె.ఎల్.రాహుల్. ఇక శాస్త్ర చికిత్స కారణంగా కె.ఎల్.రాహుల్ స్వదేశంలో జరిగిన సౌత్ఆఫ్రికా, ఇంగ్లాండ్ సిరీస్ లకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే జూలై 22 వ తేదీ నుంచి జరగబోయే వెస్టిండీస్ పర్యటనకు మాత్రం కె.ఎల్.రాహుల్ జట్టులో అందుబాటులోకి రాబోతున్నాడు తెలుస్తోంది. ఇక గాయం నుంచి కోలుకున్న జట్టులోకి వస్తున్న కేఎల్ రాహుల్ ఎలా రాణిస్తాడు అనేది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. మహిళా బౌలర్ జులన్ గోస్వామి కూడా మరికొన్ని రోజుల్లో టీమిండియాతో చేరబోతోంది.