సత్తాచాటిన నీరజ్ చోప్రా.. మరో గోల్డ్ మెడల్ వచ్చేసినట్టేనా?
అయితే టోక్యో ఒలింపిక్స్ తర్వాత పాల్గొన్న పలు పోటీలలో కూడా నీరజ్ చోప్రా మెరుగైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో కూడా పాల్గొంటున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే భారత్ నుంచి ఎంతోమంది క్రీడాకారులు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొంటున్నప్పటికీ అందరి చూపు మాత్రం నీరజ్ చోప్రా పైనే ఉంది అని చెప్పాలి. టోక్యో ఒలంపిక్స్ మాదిరిగానే మరోసారి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో భారత్కు బంగారు పతకాన్ని సాధించి పెట్టే వీరుడు నీరజ్ చోప్రా అని ఇండియన్స్ అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే అతనికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు.
కాగా ఇండియన్స్ అందరి ఆశలను నిలబెడుతూ అటు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఫైనల్కు దూసుకెల్లాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం జావలిన్ త్రో చేసిన నీరజ్ చోప్రా ఫైనల్లో అడుగుపెట్టాడు. స్టాక్ హోమ్ లో జరిగిన డైమండ్ లీగ్ లో 89.94 మీటర్ల దూరం ఇక కొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 90 మీటర్ల దూరానికి కేవలం ఆరు సెంటీమీటర్ల దూరంలో నిలిచిపోయాడు అని చెప్పాలి. ఇక ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోటీలో నీరజ్ చోప్రా ఎంతదూరం త్రో విసురుతాడు అన్నది ఆసక్తికరంగా మారింది.