సచిన్ కు షాకిచ్చిన శుభమన్ గిల్.. అరుదైన బ్రేక్?
ఈ క్రమంలోనే నిర్ణీత 50 ఓవర్లలో 305 పరుగులు చేయగలిగింది వెస్టిండీస్ జట్టు. దీంతో భారత జట్టు అతికష్టం మీద మూడు పరుగుల తేడాతో విజయం సాధించడం గమనార్హం. అయితే మొదటి వన్డే మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ లు అద్భుతంగా రాణించారు అని చెప్పాలి. ఇక వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డే తో రీ ఎంట్రీ ఇచ్చిన భారత యువ ఓపెనర్ శుభ మాన్ గిల్ తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 53 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లు సహాయంతో 64 పరుగులు సాధించి సత్తా చాటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో అర్థ సెంచరీతో మెరిసిన శుభ మాన్ గిల్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
వెస్టిండీస్ గడ్డపై వన్డే ఫార్మాట్లోనూ అర్థ సెంచరీ సాధించిన రెండవ భారత అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. అంతకుముందు ఈ రికార్డు క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఇటీవలే అర్థ సెంచరీ చేసిన శుభ మాన్ గిల్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు అని చెప్పాలి. వెస్టిండీస్ గడ్డపై వన్డే ఫార్మాట్ లో సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల మూడు రోజుల వయసులో అర్థ సెంచరీ నమోదు చేశాడు. అయితే శుభ మాన్ గిల్ మాత్రం 22 ఏళ్ళ 317 రోజుల వయసులో ఈ ఘనతను సాధించడం గమనార్హం. ఇక అంతకు ముందు విరాట్ కోహ్లీ 22 ఏళ్ళ 215 రోజుల వయసులో ఈ ఘనత సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు.