ఐపీఎల్కు నిజంగా థాంక్స్ చెప్పాల్సిందే : శిఖర్ ధావన్
యువ ఆటగాళ్లు అందరూ కూడా మంచి ప్రదర్శన చేశారని ఎవ్వరూ కూడా ఆత్మ విశ్వాసం కోల్పోలేదు అంటూ శిఖర్ ధావన్ వ్యాఖ్యానించాడు. ఇక చివర్లో ఆవేష్ ఖాన్ కీలకమైన పరుగులు చేశాడు. ఇక ఇదంతా కేవలం బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగానే జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ధన్యవాదాలు తెలిపాడు శిఖర్ధావన్. అయితే ముందుగా అటు వెస్టిండీస్ ఓపెనర్లు శుభారంభం చేశారు అంటూ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.
అయితే శిఖర్ ధావన్ ఇలా ఐపీఎల్కు థాంక్స్ చెప్పడానికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవలి కాలంలో ఎంతోమంది యువ ఆటగాళ్లకు ఐపీఎల్ ఒక మంచి వేదికగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అందరూ మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. భారత జట్టు లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక యువ ఆటగాళ్లందరూ కూడా మెరుగైన ప్రదర్శన చేయడానికి ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐపీఎల్లో ప్రపంచస్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఆటగాళ్లు కూడా ఉంటారు కాబట్టి ఆటగాళ్లు తక్కువ సమయంలోనే గొప్ప అనుభవం సాధించేందుకు కూడా ఐపీఎల్ ఉపయోగ పడుతుంది అని చెప్పాలి.