సిరీస్ గెలిచిన.. అదొక్కటే నిరాశపరిచింది?

praveen
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా వెస్టిండీస్ మధ్య  జరిగిన వన్డే మ్యాచ్ లో భాగంగా రెండు మ్యాచ్లు ముగిసాయ్. అయితే ఈ రెండు మ్యాచ్ లలో కూడా టీమిండియా  విజయం సాధించింది అని చెప్పాలి. అయితే టీమిండియా వెస్టిండీస్ పై ఆధిపత్యం సాధించింది అని చెప్పడం కంటే ఇరు జట్ల మధ్య అత్యుత్తమమైన పోరు జరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఒకరు ఒకరి పై ఆధిపత్యం చెలాయించారు అనేకంటే స్వల్ప తేడాతో విజయం సాధించి అదృష్టం తో గెలిచారు అని చెప్పాలి. చివరి బంతి వరకు కూడా ఎవరు గెలుస్తారు అన్నది ఊహకందని విధంగానే మారిపోయింది.


 తద్వారా వెస్టిండీస్ భారత్ మధ్య జరిగిన రెండు మ్యాచ్ లు కూడా  కూడా పైసా వసూల్ మ్యాచ్ లుగానే జరిగాయ్ అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఒకానొక సమయంలో జట్టు ఓడిపోతుంది అనుకుంటున్న సమయంలో భారత బ్యాట్స్మెన్ అక్షర్ పటేల్ తన బ్యాటింగ్ నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. 35 బంతుల్లో 64 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రెండో వన్డే మ్యాచ్లో కూడా విజయం సాధించిన టీమిండియా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఇదే విషయంపై మాట్లాడినా అక్షర్ పటేల్ రెండో వన్డేలో మంచి స్కోరు నమోదు చేయడం పట్ల సంతోషంగానే ఉన్నాను. కానీ నేను అవుట్ అయిన విధానమే కాస్త నిరాశ పరిచింది అంటూ చెప్పుకొచ్చాడు.


 ఇక తదుపరి మ్యాచ్లో మరింత మెరుగ్గా రాణించి సెంచరీ సాధించాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపాడు. కాగా వరుసగా రెండు మ్యాచ్లలో శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అయితే వరుసగా రెండు మ్యాచ్లలో హాఫ్ సెంచరీలు సెంచరీలు గా మలిచి ఉంటే బాగుండేది అని  అభిప్రాయం వ్యక్తం చేశాడు. కానీ ఆ ఛాన్స్ మిస్ అయ్యాను. నాకు నిరాశే మిగిలింది. ఇక రెండో వన్డే మ్యాచ్లో కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఎంతో టెన్షన్ కు గురయ్యారు అంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మాకు ఆయన ఏదో ఒక సలహా ఇస్తూనే ఉన్నారు అంటూ తెలిపారు శ్రేయస్ అయ్యర్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: