చేసింది 9 సెంచరీలు.. సచిన్ రికార్డునే బద్దలు కొడతానన్నాడు?

praveen
గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ ఎంత పేలవమైన ఫాంలో కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  పదేళ్లలో 20 వేల పరుగులు చేసి సెంచరీలతో సునామీ సృష్టించిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు సెంచరీతో స్నేహం చెడి పోయింది అనే విధంగానే పేలవమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. విరాట్ కోహ్లీ సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు అయిపోతుంది. సెంచరీ విషయం పక్కన పెడితే ఒక సాదా సీదా ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోతున్నాడు విరాట్ కోహ్లీ. రెండంకెల స్కోరు చేయడానికి కూడా నానా తంటాలు పడుతున్నాడు.

 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ పై విమర్శలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ కెరీర్లో 70 సెంచరీలు చేశాడు. టెస్టుల్లో 27 వన్డేల్లో 43 సెంచరీలు చేశాడు. భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ వంద సెంచరీల టాప్ లో ఉండగా రికీపాంటింగ్ 71 సెంచరీలతో తర్వాత స్థానంలో నిలిచాడు అని చెప్పాలి. ఇక వన్డేల్లో సచిన్ టెండుల్కర్ 49 సెంచరీల రికార్డ్ బ్రేక్ చేయాలంటే విరాట్ కోహ్లీకి మరో ఆరు సెంచరీలు కావాలి.

 ఇక ఇటీవల విరాట్ కోహ్లీ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు ఓక్లే స్పోర్ట్స్ మార్కెటింగ్ హెడ్ అశ్విన్ కృష్ణన్ సచిన్ రికార్డును బ్రేక్ చేస్తానని కోహ్లీ నాతో చెప్పాడు అని గుర్తు చేసుకున్నాడు. 2003లో మేము ఓక్లే  బ్రాండ్ అంబాసిడర్ గా విరాట్ కోహ్లీని తీసుకోవాలని అనుకున్నాం. విరాట్ కోహ్లీ తన మేనేజర్ బంటి తో కలిసి మా దగ్గరికి వచ్చాడు. నేను చాంపియన్స్ లీగ్ కోసం ముంబైలో ఉన్నాను. కేవలం కాంట్రాక్ట్ కోసం ఇక్కడికి వచ్చాను అంటూ చెప్పాడు. అప్పుడు కోహ్లీకి 24 ఏళ్లు మాత్రమే.. అప్పటి వరకు 9 సెంచరీలు మాత్రమే చేశాడు. ఆ సమయంలోనే ఖచ్చితంగా సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తా అని నాతో చెప్పాడు. అతని మాటలు విని నేను షాక్ అయ్యాను. అప్పటికి సచిన్ రికార్డుల అందుకోవాలంటే కోహ్లీకి కావాల్సింది 40 సెంచరీలు. ఇప్పుడు ఈ రికార్డుకు చేరువలో ఉన్నాడు. కోహ్లీ గురించి ఎవరెన్ని చెప్పిన నాకు మాత్రం కోహ్లీ చెప్పిన మాటలే గుర్తొస్తాయ్ అంటూ అశ్విన్ కృష్ణన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: