డీకే ఫినిషర్ ఏంటి.. ఫినిషర్లు అంటే వాళ్ళు?

praveen
దినేష్ కార్తీక్ గత కొన్ని రోజుల నుంచి టీమ్ ఇండియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. కెరీర్ ముగిసిపోయింది ఇక రిటైర్మెంట్ ప్రకటించి కామెంటేటర్ గా మారడం  బెటర్ అనుకుని స్థాయి నుంచి అతను టీమిండియాలో ఉంటే ఇండియా తప్పక గెలుస్తుంది అనుకునే స్థాయికి ఎదిగాడు. ఒకప్పుడు టీమిండియాలో అడపా దడపా అవకాశాలు మాత్రమే దక్కించుకున్న దినేష్ కార్తీక్ ఇక ఇప్పుడు మతం టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అద్భుతంగా రాణిస్తూ అదిరిపోయే ప్రదర్శన తో ఆకట్టుకుంటున్నాడు. చివర్లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ టీమిండియాకు మంచి విషయాన్ని అందిస్తూ ఫినిషర్ గా కీలక పాత్ర పోషిస్తున్నారు అని చెప్పాలి. అయితే వెస్టిండీస్తో జరుగుతున్న  టి20 సిరీస్ లో కూడా అదరగొడుతున్నాడు. దీంతో టీమిండియాకు ఫినిషర్ దొరికినట్టే అని అందరూ అనుకుంటూ ఉంటే మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ మాత్రం దినేష్ కార్తీక్ అసలు ఫినిషర్ కాదు అంటూ చెబుతున్నాడు.

 దినేష్ కార్తీక్ ఫినిషర్ కాదు.. అంతేకాదు ఫినిషర్ అనే పదానికి మీరిచ్చే నిర్వచనం కూడా కరెక్ట్ కాదు అంటున్నాడు కృష్ణమాచారి శ్రీకాంత్.  దినేష్ కార్తీక్ బాగా ఆడుతున్న మాట నిజమే.. ఐపీఎల్లో అతను ఆడిన తీరు అద్భుతం. టీమిండియాకు కూడా కొన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతను మాత్రం ఫినిషర్ కాదు. ఎందుకంటే ఫినిషెర్ అనేవాడు 8, 9 ఓవర్లలో నుంచి ఆడుతూ మ్యాచ్ ముగింపు స్టేజి వరకు తీసుకెళ్తూ ఉంటాడు.  కానీ దినేష్ కార్తిక్ చేస్తున్నది ఫినిషెర్ రోల్ కాదు చివరి లో వచ్చి మెరుగులు దిద్దుకున్నాడు అంతే. సూర్య కుమార్ యాదవ్ ని ఫినిషెర్ అనొచ్చు.. హార్దిక్ పాండ్యా రిషబ్ పంత్ లను  కూడా ఫినిషర్ లుగా పిలవచ్చు.  రోహిత్ శర్మ కూడా కొన్నిసార్లు ఆరంభం నుంచి చివరి వరకు ఆడుతాడు అతన్ని కూడా ఫినిషర్ అనొచ్చు.  కానీ దినేష్ కార్తీక్ ఫినిషర్ కాదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dk

సంబంధిత వార్తలు: