దిగ్గజ అంపైర్ మృతి.. వీరేంద్ర సెహ్వాగ్ బావోద్వేగం?
ఇలా అంపైరింగ్ విభాగంలో కూడా దిగ్గజాలు గా ఎదిగిన వారు ఉన్నారు. అలాంటి వారిలో దక్షిణాఫ్రికా దిగ్గజ అంపైర్ రూడి కోయిర్జెన్ ఒకరు. అయితే 73 ఏళ్ల రూడి కోయిర్జెన్ ఇటీవలే కన్ను మూసారు. దక్షిణాఫ్రికా లోని రివర్ డాలే ప్రాంతాలలో రూడి కోయిర్జెన్ తో పాటు మరో ముగ్గురు మృత్యువాత పడినట్లు అధికారులు వెల్లడించారు.. అంపైర్ మృతి పై ఆయన కుమారుడు జూనియర్ రూడి కోయిర్జెన్ స్పందించారు. స్నేహితులతో కలిసి గోల్ఫ్ ఆడేందుకు వెళ్లిన తండ్రి చివరికి తుది శ్వాస విడిచారు అంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.
అయితే రూఢీ మృతితో ఎంతోమంది అభిమానులు దిగ్భ్రాంతికి లో మునిగి పోయారు అని చెప్పాలి. ఇక రూడి కోయిర్జెన్ మృతిపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే సదరు దిగ్గజ అంపైర్ తో ఉన్న అనుబంధం గురించి ట్విట్టర్ వేదికగా స్పందించాడు వీరేంద్ర సెహ్వాగ్. ఈ క్రమంలోనే ఓంశాంతి.. వాలే రూఢీ మృతికి ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నా.. రూడి కోయిర్జెన్ తో అద్భుతమైన అనుబంధం ఉండేది. ఎప్పుడైనా కాస్త ర్యాష్ గా షాట్ కొట్టి నప్పుడు ఆయన వెంటనే కోప్పడే వాడు. కాస్త నిదానంగా ఆడు నీ బ్యాటింగ్ చూడాలని ఉంది. అలాగే మా అబ్బాయ్ కి మంచి ప్యాడ్స్ కొనాలి ఏమైనా మంచి బ్రాండ్ వుంటే చెప్పు అంటూ ఎప్పుడూ నాతో బాగా మాట్లాడేవాడు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ఒకానొక సమయంలో ఇక మంచి ప్యాడ్స్ కొనుగోలు చేసి ఆయనకు గిఫ్టుగా ఇచ్చాను అని తెలిపాడు వీరేంద్ర సెహ్వాగ్..