అప్పుడు రోహిత్ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు : డీకే

praveen
ప్రస్తుతం టీమిండియాలో కీలకమైన బ్యాట్స్మెన్గా కొనసాగుతూ ఉండటమే కాదు టీమిండియా సారథ్య బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు రోహిత్. ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో టీమిండియాకు వరుస విజయాలు అందిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక రోహిత్ శర్మకు అటు భారత క్రికెట్ లో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ గురించి ఏ విషయం సోషల్ మీడియాలో వచ్చిన అది హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.


 ఇకపోతే ఇటీవల రోహిత్ శర్మ కెరీర్ ఎలా సాగింది అనే విషయం గురించి తన సహచర ఆటగాడు దినేష్ కార్తీక్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ముఖ్యంగా టెస్టులలో కుదురు కునేందుకు  రోహిత్ శర్మ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడని తెలిపాడు. టెస్ట్ క్రికెట్ లో తన వంతు పాత్ర పోషించాలని రోహిత్ శర్మ ఎప్పుడూ అనుకుంటూ ఉండే వాడు.. నాతో మాట్లాడిన ప్రతిసారీ కూడా కొన్ని విషయాలు కలిసి రావట్లేదు అంటూ చెబుతూ ఉండేవాడు.. కొన్ని కొన్ని సార్లు అనవసరమైన షాట్లు ఆడి వికెట్ కోల్పోతూ ఉండేవాడు. కానీ తాను పుంజుకుంటాను అన్న నమ్మకాన్ని మాత్రం రోహిత్ శర్మ కోల్పోయే వాడు కాదు.


 అయితే తన తొలి రెండు టెస్టుల్లో కూడా రోహిత్ శర్మ సెంచరీ చేశాడు అని చెప్పాలి. అయితే సచిన్ రిటైర్ అయిన తర్వాత టెస్ట్ క్రికెట్లో అతడి లాగా మిడిలార్డర్లో రాణించగల ఆటగాడు  రోహిత్ శర్మ మాత్రమే అని ఎంతోమంది అభిమానులు భావించారు.  కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం రోహిత్ శర్మ వైఫల్యాలు వెంటాడాయి. ఇలాంటి సమయంలోనే ఎన్నో విమర్శలను ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఇప్పుడు అత్యుత్తమ క్రికెటర్ గా నిలిచాడు అంటూ దినేష్ కార్తీక్ గుర్తు చేసుకున్నాడు. కాగా 2013లో వెస్టిండీస్పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన రోహిత్ మిడిలార్డర్లో బరిలోకి దిగి వరుసగా రెండు శతకాలు బాదాడు. కానీ ఆ తర్వాత మాత్రం వైఫల్యాలు అతని వెంటాడాయి. 2019లో ఓపెనర్ గా అవతారమెత్తిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: