విజయం మాదే.. పాక్ మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్?

praveen
మరికొన్ని రోజుల్లో యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కాబోతోంది. మినీ ప్రపంచ కప్ గా పిలవబడే ఆసియా కప్ లో బాగా రాణించేందుకు ప్రస్తుతం ప్రతి ఒక్కరు సిద్ధమైపోయారు. అయితే ఇక ఎన్నో జట్లు ఆసియా కప్లో పాల్గొంటున్నప్పటికీ అటు భారత్-పాకిస్థాన్ జట్ల మీదే అందరి దృష్టి ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా ఈ నెల 28వ తేదీన ఆసియా కప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరం గా మారిపోయింది.

 అయితే గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చర్చ జరుగుతూ ఉండగా ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఇదే విషయంపై స్పందిస్తూ  తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో విజేత ఎవరు అన్న  విషయంపై ఒక అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. కాగా ఇటీవల ఈ లిస్టులో చేరిపోయాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్.. భారత్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్లో పాకిస్థాన్ విజయం సాధించడం ఖాయం అంటూ జోస్యం చెప్పాడు.ఇటీవలే ఒక స్పోర్ట్స్ చానల్ తో మాట్లాడాడు.

 సాధారణంగా మెగా టోర్నీలో ఏ జట్టు అయినా సరే మొదటి మ్యాచ్ విజయంతో ప్రారంభించాలని భావిస్తోంది.. ఈ క్రమంలోనే  మా జట్టు తొలి మ్యాచ్లోనే భారత్ ను ఢీకొట్టబోతుంది. అయితే పాకిస్తాన్ జట్టు  పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. గతంలో  ఇదే వేదికపై భారత్ మట్టికరిపించాము. యూఏఈలో పరిస్థితులు పాకిస్తాన్ కు బాగా తెలుసు. గతంలో ఇక్కడే ఎన్నో ద్వైపాక్షిక సిరీస్ లతోపాటు పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్లు ఆడాము. కాబట్టి ఆసియా కప్లో భాగంగా భారత్ పాకిస్థాన్ మధ్య జరగబోయే మ్యాచ్ లో తప్పకుండా మేమే విజయం సాధిస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. సర్ఫరాజ్ అహ్మద్ వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: