టీమిండియాను విమర్శించిన పాక్ ఫ్యాన్స్.. కౌంటర్ ఇచ్చిన కనేరియా?

praveen
ప్రస్తుతం భారత జట్టు జింబాబ్వే పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. జింబాబ్వే పర్యటనలో భాగంగా మొదటి వన్డే మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది టీమిండియా. జింబాబ్వే జట్టు తమ ముందు ఉంచిన 190 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే చేధించింది అని చెప్పాలి. అయితే రెండో వన్డే మ్యాచ్లో అలా జరగలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు కేవలం 161 పరుగులకే ఆలౌట్ అయింది.  కాని ఆ తర్వాత మాత్రం ఆతిథ్య  జింబాబ్వే జట్టు బౌలింగ్ విభాగం పట్టు బిగించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఈ క్రమంలోనే 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటింగ్ విభాగం వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే తక్కువ బంతుల్లోనే టార్గెట్ ను చేదించిన 5 వికెట్లు కోల్పోవడం గమనార్హం. దీంతో ఇక ఐదు వికెట్ల తేడాతో జింబాబ్వే జట్టుపై విజయం సాధించింది. ఈ క్రమంలో అటు పాకిస్థాన్ ప్రేక్షకులు కాస్త ఓవరాక్షన్ చేశారు. జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ ను విమర్శించారూ. అయితే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అభిమానుల తీరును తప్పు పట్టారు. ఒకవేళ టీమిండియా స్థానంలో పాకిస్థాన్ జట్టు గనక ఉండి ఉంటే 50 ఓవర్ల వరకు మ్యాచ్ సాగేది అంటూ చురకలు అంటించాడు.


 టీమిండియా 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఐదు వికెట్లు కోల్పోవడంతో ఎంతోమంది పాకిస్థాన్ అభిమానులు విమర్శిస్తున్నారు. నిజానికి భారత ఆటగాళ్లు పూర్తి దూకుడైన ఆటతోనే ముందుకు సాగారు. సుమారు 25 ఓవర్లలోనే మ్యాచ్ ముగించేశారు. పాకిస్థాన్ జట్టుకు ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తే 50 ఓవర్ల పాటు ఎంతో తంటాలు పడే వారు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు. ఇక అతను టీమిండియా కు మద్దతుగా మాట్లాడటం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. మ్యాచ్ విషయానికి వస్తే రెండో మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: