ఆ ఇద్దరూ లేకపోవడం.. పాకిస్తాన్ కు అడ్వాంటేజే?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఆ మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మ్యాచ్ జరిగే రోజును ప్రతిరోజు  వేళ్లపై లెక్కపెట్టుకుంటూ ఉన్నారు. ఆ హై వోల్టేజీ మ్యాచ్ ఎంతగానో ఎంటర్టైన్మెంట్ పొందాలి అని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది స్టేడియంలో మ్యాచ్ వీక్షించేందుకు సిద్ధమయ్యారు. మరికొంతమంది టీవీల ముందు కూర్చుని హాయిగా ఫ్యామిలీతో పాప్ కార్న్ తింటూ ఉత్కంఠభరితమైన మ్యాచ్ ని చూస్తూ ఉండిపోవాలని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఇంతకీ నేను చెబుతుంది దేని గురించి మీకు అర్ధం అయి ఉంటుంది.



 మినీ ప్రపంచ కప్ గా పిలువబడే ఆసియా కప్ లో భాగంగా ఈనెల 28వ తేదీన జరగబోయే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి. ఇక ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో ఈ మ్యాచ్ హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఇదే విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటీవల ఇదే విషయంపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ సర్ఫరాజ్ నవాజ్ స్పందించాడు. అయితే ఒకవైపు టీమిండియాకు జస్ప్రిత్ బూమ్రా మరోవైపు పాకిస్థాన్ జట్టుకు షాహీన్ అఫ్రిది గాయాల కారణంగా దూరమయ్యారు. ఇరు జట్లకు ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి.


 మొహమ్మద్ షమీ సెలెక్ట్ కాకపోవడం మరోవైపు హర్షల్ పటేల్ కూడా గాయంతో దూరం కావడంతో భువనేశ్వర్ కుమార్ ఆధ్వర్యంలో భారత బౌలింగ్ ఎటాక్ కొనసాగించబోతుంది. అయితే ప్రస్తుతం భారత బౌలింగ్ విభాగంలో బుమ్రా, మహ్మద్ షమి లేకపోవడం పాకిస్తాన్కు అడ్వాంటేజ్ అవుతుంది అంటూ సర్ఫరాజ్ నవాజ్ చెప్పుకొచ్చాడు. బౌలర్లు మ్యాచ్లను గెలిపించగలరు.. ప్రీమియం ఫేసర్లు బుమ్రా షమి  దూరమయ్యారు. ఈ పరిస్థితిని అటు పాకిస్థాన్ అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. పాకిస్తాన్ ఈ మధ్య బలహీనమైన జట్లతో ఆడుతుంది. భారత్ లాంటి కఠినమైన ప్రత్యర్థిని  ఎదుర్కోనేందుకు అన్ని ఫ్యాన్లు సిద్ధం చేసుకోవాలి అంటూ వ్యాఖ్యానించాడు నవాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: