గిల్ తొలి సెంచరీ.. రోహిత్, కె.ఎల్.రాహుల్ తర్వాత?

praveen
టీమిండియా యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ గత కొంతకాలం నుంచి ఎంత అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి మ్యాచ్ లో కూడా మెరుగైన ప్రదర్శన చేస్తూ భారీగా పరుగులు చేస్తూ వస్తున్నాడు శుబ్ మన్ గిల్. ఈ క్రమంలోనే టీమిండియా లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే మూడో వన్డే లో భాగంగా శుబ్ మన్ గిల్  మరోసారి అద్భుతమైన ప్రదర్శన చేశారు అని చెప్పాలి. ఏకంగా తన కెరియర్లోనే వన్డే ఫార్మాట్లో మొదటి సెంచరీ నమోదు చేశాడు ఈ యువ సంచలనం.


 ప్రస్తుతం టీమిండియా జట్టు జింబాబ్వే పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. జింబాబ్వే పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. అయితే ఇప్పటికే రెండు వన్డేలు ముగిసాయి. 2 వన్ డే మ్యాచ్ లలో  కూడా ఘన విజయం సాధించిన టీమిండియా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే మూడో వన్డేలో ఎవరు విజయం సాధిస్తారో అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక మూడో వన్డేలో మార్పులకు అవకాశం దక్కించుకున్న శుబ్ మన్ గిల్  అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. 82 బంతుల్లో 12 ఫోర్లు సహాయంతో సెంచరీతో చెలరేగిన పోయాడు.


 ఈ క్రమంలోనే తక్కువ స్కోరుకే ఉన్న టీమిండియాకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో సెంచరీ సాధించడం ద్వారా తన వన్డే కెరీర్లో మొదటి సెంచరీ నమోదు చేశాడు అని చెప్పాలి. అయితే అంతకుముందు జరిగిన రెండో వన్డేలో కూడా 33 పరుగులు చేసి రాణించాడు అనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు కూడా వన్డే ఫార్మాట్ లో తమ తొలి సెంచరీ నమోదు చేసింది జింబాబ్వే జట్టు పైన కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gil

సంబంధిత వార్తలు: