అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు.. బీసీసీఐపై ఆగ్రహం?

praveen
గత కొంత కాలం నుంచి టీమిండియా చేతిలో వరుస ప్రయోగాలు చేస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఎప్పుడు ఎవరు జట్టు లో స్థానం సంపాదించుకుంటారు అనేది ఊహకందని విధంగా ఉంది. అదే సమయం లో ఒక వేళ టీమిండియా ఏదైనా సిరీస్ లో గెలిచిన తర్వాత నామ మాత్రమైన  మ్యాచ్ ఆడాల్సి ఉంటే ఇక బెంచ్ స్ట్రెంత్  మొత్తం పూర్తి జట్టు లోకి తీసుకుని వారితో ప్రయోగాలు చేస్తూ ఉంది అని చెప్పాలి.


 కాగా ప్రస్తుతం టీమిండియా జింబాబ్వే పర్యటన లో ఉంది. ఈ పర్యటన లో భాగంగా మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. నేడు నామ మాత్రం అయిన మూడో వన్డే మ్యాచ్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భాగం గా బెంచ్ కే పరిమితమైన ఆటగాళ్లకు జట్టు లో అవకాశం లభించే అవకాశం వుందని అందరూ అనుకొంటారు. ముఖ్యం గా రాహుల్ త్రిపాఠీ, ఋతురాజ్ గైక్వాడ్ లాంటి ఆటగాళ్ళు తప్పకుండా జట్టు లోకి వస్తారని భావించారు. కానీ అలా జరగ లేదు అని చెప్పాలి.


 అయితే నామ మాత్రమైన మ్యాచ్లో కూడా రాహుల్ త్రిపాఠీ, గైక్వాడ్ లకు స్థానం ఇవ్వక పోవడంపై అభిమానులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్లోనైనా సరే వారికి ఛాన్స్ ఇవ్వాల్సింది.. నిజంగా ఇది అన్యాయమే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. సెలెక్ట్ చేయాలనే ఉద్దేశం లేనప్పుడు వారిని ఎందుకు జింబాబ్వే పర్యటనకు తీసుకువెళ్లారు అంటూ ప్రశ్నిస్తున్నారు. మూడో వన్డే మ్యాచ్కు ముందు టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ సైతం ఆ ఇద్దరికి చోటు తగ్గకపోతే అది అన్యాయమే అవుతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: