అది గుర్తొస్తే ఇప్పటికి నిద్ర పట్టదు : కపిల్ దేవ్
ఈ క్రమంలోనే జట్టును గెలిపించేందుకు అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే టార్గెట్గా పెట్టుకుంటారు ప్రతి ఆటగాడు. కానీ కొన్నిసార్లు మాత్రం ఆటగాళ్ళకు నిరాశ ఎదురవుతూ ఉంటుంది. అయితే భారత్పై పాకిస్థాన్ విజయం సాధించినా లేదా పాకిస్థాన్పై భారత్ విజయఢంకా మోగించిన కూడా ఓడిపోయిన జట్టు ఆటగాళ్లు తీవ్ర నిరాశలో మునిగిపోతూ ఉంటారు. ఇకపోతే మరికొన్ని రోజులలో ఆసియా కప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఇటీవలే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తన కెరియర్ లో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 1986లో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. ఇక ఈ మ్యాచ్ గురించి ఇప్పుడు తలచుకున్నా నిద్ర పట్టదు అంటూ చెప్పుకొచ్చాడు కపిల్ దేవ్. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో చివరి బంతికి నాలుగు పరుగులు అవసరమైన సమయంలో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మియాందాద్ సిక్సర్ కొట్టి ఇక భారత్ ఓటమి శాసించాడు. అయితే ఈ ఓటమి నుంచి కోలుకోవడానికి తనకు నాలుగేళ్ల సమయం పట్టింది అంటూ చెప్పుకొచ్చాడు.