భారత్ - పాకిస్తాన్ మ్యాచ్.. అదనంగా 4 వేల టిక్కెట్లు?

praveen
సాధారణంగా భారత క్రికెట్లో ఎన్నో జట్లు తలపడుతు ఉంటాయి. కానీ ప్రపంచ క్రికెట్లో ఎంతో ప్రత్యేకమైన పోరు ఏది అంటే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఏకధాటిగా చెప్పేది భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ అని. ఎందుకంటే కేవలం ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది ఈ మ్యాచ్. భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిగా క్రికెట్ సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలోనే ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగవు. కేవలం ప్రపంచకప్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడటం ప్రేక్షకులు చూస్తూ ఉంటారు.


 అంతేకాదు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే చాలు అది ఒక ఎమోషన్ గా ఫీల్ అవుతూ ఉంటారు ప్రేక్షకులు. అందుకే ఈ మ్యాచ్ ను హై ఓల్టేజీ మ్యాచ్  గా పిలుస్తూ ఉంటారు.  కాగా మరికొన్ని రోజుల్లో ఆసియా కప్లో భాగంగా భారత్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది టి 20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమి చవిచూసిన భారత్ ఇక ఇప్పుడు ఆసియా కప్ లో ప్రతీకారం తీసుకోవాలని భావిస్తోంది. ఆ సమయంలో ఆసియా కప్ గెలవాలనే ఆత్మవిశ్వాసంతో ఉంది పాకిస్తాన్ చెట్టు.  ఈ క్రమంలోనే ఆసియా కప్లో ఈనెల 28వ తేదీన జరగబోయే మ్యాచ్ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది.


  అయితే ఇక ఆసియా కప్ లో  మ్యాచ్ గురించి చర్చ ముగిసేలోపే వరల్డ్ కప్ లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. అక్టోబర్ 23 వ తేదీన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కి సంబంధించిన టికెట్లు విడుదల చేయగా కేవలం 5 నిమిషాల్లోనే అన్నీ అమ్ముడుపోయాయి. ఇలాంటి సమయంలో ఈ మ్యాచ్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 4 వేల టికెట్లను అదనంగా  విడుదల చేయాలని భావిస్తోంది. స్టేడియం కి ఎవరు ముందు వస్తే వారికి టికెట్లు అందించనున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: